కరోనా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంటూ వస్తుంది. ఈ మేరకు లాక్ డౌన్ ను  విధించింది. ఇందులో  భాగంగా ప్రజలందరూ స్వచ్చందంగా ఇళ్లకే పరిమితమయ్యారు. గుంపులుగా ఎక్కడకు వేళ్ళ కూడదని ప్రభుత్వం  సూచించింది. అంతేకాదు కరోనా రాకుండా తగిన జాగ్రత్తలు  సూచింది. 

 

 


ఏప్రిల్ 14 వరకు ఈ లాక్ డౌన్ కొనసాగనుంది.. ఈ మేరకు జన సంచారం బయట కనిపిస్తే పోలీసులు కరోనా ప్రభావం పై అవగాహనా కల్పిస్తూ వారికి ఇళ్లలోనే  సూచిస్తున్నారు. మరి పోలీసుల చెయ్యి దాటి పోతే ప్రభుత్వం నియమాలను ఉల్లంగిస్తే క్రిమినల్  బనాయించాలను ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.. అంతేకాకుండా లాఠీ విరిగేలా కొడుతున్నారు. అయినా ప్రజలు కూడా అలానే ఉన్నారు. 

 

 


లాక్ డౌన్  కారణంగా పెళ్లిళ్లు  ఎక్కడిక్కడ ఆగిపోయాయి. కొంతమంది బంధుమిత్రులు లేకుండా పెళ్లి చేసుకుంటున్నారు. బంధువులు, మిత్రులు.. వీడియో కాల్ ద్వారా పెళ్లి వేడుకను తిలకిస్తున్నారు. అయితే, ఈ పెళ్లి మాత్రం వెరైటీ. వధువరులిద్దరూ ఒక చోట లేకున్నా.. వర్చువల్‌గా పెళ్లి జరిగిపోయింది. అదెలా అనుకుంటున్నారా? ఇదిగో ఇలా.

 

 

ముంయిలో మర్చెంట్ నావీ అధికారిగా పనిచేస్తున్న ప్రీతమ్ సింగ్, ఢిల్లీకి చెందిన నీత్ కౌర్‌లు ప్రేమించుకున్నారు. ఇరువురి కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించారు. ఏప్రిల్ 5వ తేదీకి ముహూర్తం ఖరారు చేశారు. ఇంతలో కరోనా వైరస్ దేశంలోకి ప్రవేశించి వీరి ఆశలపై నీళ్లు చల్లింది. ఇంకా చేసేదేమి లేకపోవడంతో వీడియో కాల్ ద్వారా వివాహ వేడుకను కానిచ్చేశారు..అదండీ ఏ ఖర్చు లేకుండా పెళ్లి జరిగిపోయింది.. సిక్కుల సాంప్రదాయం ప్రకారం పెళ్లి వేడుకను పూర్తి చేశారు. ఈ సందర్భంగా వరుడు ప్రీత్ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ.. ‘‘వాహేగురు ఆశీర్వాదం లేకుండా మా పెళ్లి పూర్తయినట్లు కాదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: