దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏ సదుపాయం కూడా అందుబాటులో ఉండడం లేదు. కరోనా  వైరస్ ను కట్టడి చేయడంలో భాగంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్  విధించింది కేంద్ర ప్రభుత్వం. అన్ని రవాణా వ్యవస్థను మూసి  వేయడం సహా... ప్రజలకు నిత్యావసర సరుకులు తప్ప మిగతా అంతా మూసి వేశారు. ఒకవేళ నిత్యావసర సరుకులు కొనాలన్నా అది సాయంత్రం సమయం వరకే అందుబాటులో ఉంటున్నాయి . ఇక వైద్య సేవలు అంతంత మాత్రంగానే ప్రజలకు లభిస్తున్నాయి. లాక్ డౌన్ ఎఫెక్ట్ కారణంగా ఇక్కడ ఒక నిండు గర్భిణి మృతి చెందారు. రక్తం దొరక్కపోవడంతో ప్రాణాలు విడిచింది 9 నెలల గర్భిణీ

 

 

 లాక్ డౌన్  ఉన్నప్పటికీ ఎంతో జాగ్రత్తగా సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లారు భర్త. భార్యకు రక్తహీనత ఉండడంతో సకాలంలో రక్తం దొరకక పోవడం వల్ల ప్రాణాలు పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గర్భంతో ఉన్న భార్య కడుపులో ఉన్న బిడ్డని కాపాడుకోవడానికి ఎంత  ప్రయత్నించినా... భార్యను మాత్రం కాపాడుకోలేక పోయాడు. ఈ విషాద ఘటన ఆందోళన కలిగిస్తోంది. అనంతపురంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాలోని తాడిపత్రి కి చెందిన నారాయణ స్వామి పద్మావతి భార్య భర్తలు. ప్రస్తుతం పద్మావతి నిండు గర్భిణీ. అయితే పద్మావతి రక్తహీనత ఉండటం కారణంగా.. పరిస్థితి విషమించడంతో భర్త నారాయణ స్వామి భార్యను  జిల్లా ఆసుపత్రి కి తీసుకెళ్ళాడు. 

 

 

 ఇంతలో ఆ మహిళకు రక్తం అవసరం అయింది. కానీ బ్లడ్  బ్యాంకు లో రక్తం నిల్వ లేకపోవడం తో పరిస్థితి విషమించింది. రక్తం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. రక్తం కోసం ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే పరిస్థితి విషమించి సదరు మహిళ మృతి చెందారు. నిండు గర్భంతో ఉన్న మహిళ బిడ్డతో సహా కన్నుమూసింది. దీనిపై ఆస్పత్రి సిబ్బంది సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ రక్త దానం చేసి ప్రజలకు అండగా నిలవాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: