ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. భారత దేశంలో రోజురోజుకు విజృంబిస్తున్న కరోనా  ను   తరిమికొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకునే దేశవ్యాప్తంగా లార్డ్ విధించింది. ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్  కొనసాగుతుంది అంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. లాక్ డోన్ నేపథ్యంలో రోడ్డు రవాణా సంస్థ లతోపాటు విమానయాన రవాణ రైలు రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ఎక్కడి వారు అక్కడే చిక్కుకుపోయారు. విదేశాల నుంచి భారత్ కి రావాలి అనుకున్నవారు..  భారత్ నుంచి విదేశాలకు వెళ్లాలి అనుకునేవారు ఎక్కడి వారు అక్కడ చిక్కుకుపోయారు. అయితే ప్రస్తుతం రవాణా  ఏవీ అందుబాటులో లేకపోవడంతో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. 

 

 

 కాగా తెలంగాణ లో చిక్కుకున్న 99 మంది అమెరికన్ జాతీయులు లాక్ డౌన్  కొనసాగుతున్న సమయంలో కూడా అమెరికాకు వెళ్లారు. అది ఎలా సాధ్యమైంది అంటార... లాక్ డౌన్  కొనసాగుతున్న సమయంలో హెయిర్ ఇండియా సంస్థ అమెరికాకు చెందిన విమానాన్ని నడిపింది. . హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానం బయలుదేరగా ఇందులో 99 మంది అమెరికన్లు ఉన్నట్లు తెలిపారు. భారతదేశంలో పర్యటించేందుకు గత కొద్ది రోజుల క్రితమే ఈ 99 మంది అమెరికన్లు వచ్చినట్లు తెలుస్తోంది. 

 

 

 కాగా ఉన్నట్టుండి ఒక్కసారిగా అలా ప్రకటించడంతో... ఎటూ వెళ్లలేక హైదరాబాద్ నగరంలోని చిక్కుకున్నారు అమెరికాకు చెందిన 99. ఇక చివరికి ప్రభుత్వానికి అభ్యర్థన మేరకు.. వారందరినీ అమెరికా తీసుకెళ్లడానికి అంగీకరించింది ప్రభుత్వం. దీనికోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. అంతే కాకుండా సదరు 99 మందికి వైద్య పరీక్షలు కూడా నిర్వహించే.. విమానంలో అమెరికాకు వెళ్లేందుకు అనుమతించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: