కరోనా మహమ్మారి తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొత్తగా కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఒక్కోరోజు 50కు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి కూడా. అయితే మంగళవారం మాత్రం ఏపీ సర్కారుకు కాస్త ఊరట అనే చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల ఎన్నడూ లేనంతగా కేవలం పది మాత్రమే కొత్తగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

 

 

మంగళవారం సాయంత్రం వరకు వచ్చిన ఫలితాల ఆధారంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 314కి చేరింది. తాజాగా గుంటూరు జిల్లాలో మరో 8 కేసులు తేలాయి. కడప, నెల్లూరు జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున కొత్తగా నమోదయ్యాయి. కొన్నిరోజులుగా లెక్కకు మిక్కిలిగా కరోనా కేసులు బయటపడుతుండడంతో ఉక్కిరిబిక్కిరైన ఏపీ ప్రభుత్వానికి తాజా కేసుల సంఖ్య కాస్త ఊరట నిచ్చిందనే చెప్పాలి.

 

 

ఏపీ పరిస్థితి ఇలా ఉంటే.. తెలంగాణలో మాత్రం మంగళవారం కూడా కోవిడ్ జోరు కొనసాగింది. అక్కడ మరో 40 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక ఏపీలో ఇప్పటివరకు కరోనాతో నలుగురు మరణించారు. జిల్లాల వారీగా చూస్తే ప్రస్తుతం కర్నూలు జిల్లా 74 కేసులతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత స్థానంలో 43 కేసులతో నెల్లూరు జిల్లా ఉంది.

 

 

ఇక గుంటూరు జిల్లా 41 కేసులతో మూడో స్థానంలో ఉంది. అతి తక్కువగా అనంతపురం జిల్లాలో కేవలం 6 మాత్రమే కేసులు నమోదయ్యాయి. అయితే ఉత్తరాంధ్ర జిల్లాలలైన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటి వరకూ ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. ఈ జిల్లాల్లోనూ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారు ఉన్నా.. వారికి పరీక్షలు నిర్వహించినా ఈ జిల్లాల్లో ఇప్పటి వరకూ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: