కరోనా కట్టడి కోసం ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనికి ఇప్పటి వరకూ నిర్ధిష్టమైన మందు లేకపోవడంతో వైద్యులు తమ వంతుగా ప్రయోగాలు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అక్కడకక్కడా కొన్ని విధానాలు సక్సస్ అవుతున్నాయి. ఇప్పుడు దక్షిణ కొరియా ఓ విధానం ద్వారా ఇద్దరు వృద్ధులను కరోనా బారి నుంచి కాపాడింది. ఇప్పుడు ఇది కారు చీకటిలో కాంతి పుంజంగా కనిపిస్తోంది.

 

 

ఇంతకీ కొరియా వైద్యులు ఏం చేశారు..? వీరు ప్లాస్మా థెరపీ ద్వారా ఇద్దరు వృద్ధులకు కరోనా నుంచి విముక్తి కల్పించారు. అంటే.. కొవిడ్‌-19 నుంచి కోలుకున్న వారి ప్లాస్మాతో వీరికి చికిత్స చేశారన్నమాట. ఈ చికిత్స ద్వారా తీవ్రమైన న్యూమోనియా లక్షణాల నుంచి వీరు బయటపడ్డారని కొరియా వైద్యులు తెలిపారు. ఇప్పటికే ఈ ప్లాస్మా థెరపీ బాగానే పని చేస్తుందని ఇతర దేశాల నుంచి కూడా వార్తలు వస్తున్నాయి.

 

 

ఇంతకీ ఈ ప్లాస్మా థెరపీ ఎలా చేస్తారు.. ప్లాస్మా అంటే.. రక్తంలో కలిసుండే జిగురులాంటి పారదర్శక పదార్థం. ఒకసారి కరోనా వైరస్‌ సోకి కోలుకున్నవారిలో యాంటీ బాడీస్‌ తయారవుతాయి. అలా కోలుకున్న వారిలో తయారైన యాండీ బాడీస్ వారి ప్లాస్మా నుంచి తీసుకుని మరో రోగిలో ప్రవేశపెట్టి కరోనా వైరస్ ను చంపుతారు. చివరకు యాంటీ వైరల్‌ మందులకు స్పందించని క్రిటికల్‌ కేర్‌లో ఉన్న రోగులకు కూడా ప్లాస్మా థెరపి ప్రత్యామ్నాయ చికిత్సా పద్ధతిగా మారే సత్తా ఉందని కొరియా వైద్యులు చెబుతున్నారు.

 

 

ప్రస్తుతం ఇది ట్రయల్స్ దశలోనే ఉంది. దీన్ని సైంటిఫిక్ గా రుజువు చేయాలంటే ఇంకా చాలా మందిపై ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఫలితాన్ని శాస్త్రీయంగా రుజువు చేస్తారు. అయితే ఎమర్జన్సీ కేసులపై వైద్యులు ఇప్పుడు ఈ ప్లాస్మా థెరపీని ఉపయోగించే అవకాశం ఎక్కువగా ఉంది.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: