దేశంలో కరోనా రోజు రోజుకీ విస్తరిస్తింది.  ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా.. ప్రతి రోజు ఎక్కడో అక్కడ ఈ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.  నిన్న తెలంగాణలో ఒక్క రోజే ఏకంగా 40 కేసులు నమోదు కావడం కలకలం రేపింది.  దీంతో మొత్తం కేసుల సంఖ్య 404కు చేరిందని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో కరోనాకు చికిత్స పొంది 45 మంది కోలుకున్నారని, మరో 11 మంది మరణించారని ఆయన వెల్లడించారు.   మొన్న కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. తెలంగాణలో పెద్దగా కేసులు నమోదు కావడం లేదని.. ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని.. త్వరలో కరోనాని కట్టడి చేయగలుగుతామని అన్నారు.   

 

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా ఇటీవల ఢిల్లీలో నిజాముద్దీన్ మర్కజ్ లింక్ కరోనా కేసులు ఎక్కువ గా నమోదు అవుతున్నాయని అంటున్నారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో గచ్చిబౌలిలోని స్పోర్ట్ కాంప్లెక్స్ ను రికార్డు సమయంలో 1,500 పడకల ఆసుపత్రిగా మార్చామని, ఇక్కడ ఐసీయూ, వెంటిలేటర్ సదుపాయాలను కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.  వైద్యులకు అవసరమైన పీపీఈ కిట్స్, ఎన్-95 మాస్క్ లను లక్షల సంఖ్యలో సమకూర్చుకోవాలన్న లక్ష్యంతో కృషి చేస్తున్నామని, సీఎం రిలీఫ్ ఫండ్ కు నిధులందిస్తున్న దాతలకు కృతజ్ఞతలని ఈటల పేర్కొన్నారు. 

 

పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ద్య కార్మికులు చేస్తున్న సేవలకు ప్రతి ఒక్కరూ కృతజ్ఞతలు తెలపాల్సి ఉంటుందని అన్నారు.  కరోనా వ్యాప్తి చెందకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని.. ఇది కష్టమైన రోజులు అని అందరూ ధైర్యంగా ఎదుర్కొవాలని సూచించారు.  సీఎం కేసీఆర్, సీఎస్ నిత్యమూ కరోనా పరిస్థితిపై సమీక్షలు చేస్తున్నారని, ఈ క్లిష్ట సమయంలో శ్రమిస్తున్న ఆరోగ్య, మునిసిపల్, పోలీసు సిబ్బందికి ధన్యవాదాలని తెలిపారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: