ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే  జన సమూహాల ఎక్కువగా ఉండే అన్ని ప్రదేశాలు మూతపడ్డాయి. ఈ క్రమంలోనే భారత ప్రజలు అందరూ కష్టం వచ్చినప్పుడల్లా చెప్పుకొనే ఆ దేవుని ఆలయాలు కూడా మూతపడ్డాయి. అయితే ఓ వైపు రోజురోజుకు కరోనా  వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండడంతో ప్రజల్లో  భయాందోళన నెలకొంది. ఈ క్రమంలోనే కనీసం దేవుడికి పూజలు చేసే కాపాడమని వేడుకోవాలి అని అనుకున్నప్పటికీ దేవాలయాలు మూతపడ్డాయి. దీంతో చాలా మంది భక్తులు ఆవేదనకు గురవుతున్నారు. అయితే లాక్ డౌన్  నేపథ్యంలో ప్రజల అభీష్టం సంక్షేమం  దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటున్న తెలంగాణా సర్కార్...  తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. దేవాలయాలు మూసి వేసినప్పటికీ భక్తులు పేరిట పూజలు నిర్వహించే ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. 

 

 

 అయితే భక్తులకు ఆలయ ప్రవేశం లేకున్నప్పటికీ ఆన్లైన్ ద్వారా వారి పేరిట పూజలు నిర్వహించే ఏర్పాటు చేస్తుంది. దీనికోసం గూగుల్ ప్లే స్టోర్ లో ఒక ప్రత్యేకమైన యాప్ ను అందుబాటులో ఉంచింది తెలంగాణ సర్కారు. ఈ క్రమంలోనే తొలి దశలో భాగంగా తెలంగాణలో ఎంతో ప్రసిద్ధిగాంచిన సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి దేవాలయం, కర్మన్ ఘాట్ లోని ధ్యానాంజనేయ స్వామి ఆలయంలో నేటి నుండి పూజలు అర్చనలు ప్రారంభం కానున్నాయి . అయితే ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనలనుకునే  వారు ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేసి... టీఎస్ యాప్ పోలియోను డౌన్లోడ్ చేసుకోవాలి. 

 

 

 ఇక ఈ యాప్ ఓపెన్ చేసి పూర్తి వివరాలను చూసిన అనంతరం అందులో కావాల్సిన ఆర్జిత సేవలను సెలెక్ట్ చేసుకుని... మీకు కావాల్సిన సమయానికి  ఆర్జితసేవలు జరిగేలా నమోదు చేసుకుంటే సరిపోతుంది. భక్తులు కోరిన రోజున కోరిన సమయానికి ఆ ఆలయంలో అర్చకులు భక్తుల పేరిట పూజలు నిర్వహిస్తారు. అయితే పూజల అనంతరం పసుపు కుంకుమ డ్రైఫ్రూట్స్ ప్రసాదం అందించాలనే ముందుగా కేసీఆర్ సర్కార్ భావించినప్పటికీ... కరోనా  వైరస్ ఎఫెక్ట్  కారణంగా లాక్ డౌన్ ఉన్న సమయంలో తపాలా  కొరియర్ సేవలు ఎంతో పరిమితంగా ఉన్నాయి. దీంతో ఇది  సాధ్యం కాదని భావించారు అధికారులు. అయితే శ్రీరామనవమి రోజున భద్రాచలంలో రామయ్య కల్యాణాన్ని తిలకించలేకపోయమని  ఎంతోమంది భక్తులు ఆవేదన చెందుతూ ఉంటారు. ఇలాంటి వారు కళ్యాణ తలంబ్రాలను ఈ యాప్ ద్వారా పొందేందుకు వీలు కల్పించింది తెలంగాణ సర్కారు. దీనికోసం పోస్టల్ ఛార్జీలు 30 రూపాయలు తలంబ్రాల కోసం 20 రూపాయలు సర్వీస్ చార్జీలు  చెల్లించాల్సి ఉండగా తపాలాశాఖ ఈ తలంబ్రాలను భక్తుల ఇంటికి చేరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: