అవును..! లాక్‌డౌన్ కొన‌సాగింపు విష‌యంలో చివ‌రికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ చెప్పిన విధంగానే కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకోబోతున్న‌ట్లు స‌మాచారం. రెండు రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన కేసీఆర్‌ దేశంలో, రాష్ట్రంలో క‌రోనా వైర‌స్ వ్యాప్తి, లాక్‌డౌన్ కొన‌సాగింపు అంశాల‌పై కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు మాట్లాడారు. క‌రోనా మ‌హ‌మ్మారిని అదుపుచేయ‌డం అంతా ఈజీకాద‌ని తేల్చేసిన విష‌యం తెలిసిందే. ప్రైమ‌రీ కాంటాక్టు ద‌శ‌లో ఉన్న వైర‌స్‌ను సామూహిక ద‌శ‌కు చేర‌కుండా నివారించ‌డ‌మే ల‌క్ష్యంగా కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు లాక్‌డౌన్‌ను అమ‌లు చేస్తున్న విష‌యాన్ని గుర్తు చేశారు. 

 

అయితే అనుకున్న‌ట్లుగా 21 రోజుల గ‌డువులోప‌ల పూర్తి స్థాయిలో క‌రోనా కేసుల గుర్తింపు క‌ష్ట‌త‌రంగానే మారుతోంద‌ని ముఖ్య‌మంత్రి అభిప్రాయ‌ప‌డ్డారు. వ్యాధి ఇంకా విస్త‌రించే ద‌శ‌లో ఉండ‌టం మూలంగా ఇప్ప‌ట్లో లాక్‌డౌన్‌ను ఎత్తివేయ‌వ‌ద్ద‌ని తాను ప్ర‌ధాన‌మంత్రి మోదీని కోరుతున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. అయితే ఇదంతా త‌న వ్య‌క్తిగ‌త అభిప్రాయ‌మంటూ చెప్పుకొచ్చిన విష‌యం తెలిసిందే. ఇదిలా ఉండ‌గా ముఖ్య‌మంత్రి కేసీఆర్ బాట‌లోనే దాదాపు మిగ‌తా ముఖ్య‌మంత్రులు కూడా ఇదే అభిప్రాయాన్ని కేంద్రానికి నివేదించ‌డం గ‌మ‌నార్హం. మంగ‌ళ‌వారం ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వ‌హించిన కేంద్ర‌మంత్రుల స‌మావేశంలోనూ ఇదే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వ‌డం గ‌మ‌నార్హం.

 

 ఇక సోమ‌వారం ప్ర‌ధాన‌మంత్రి మోదీ వ్యాఖ్య‌లు కూడా లాక్‌డౌన్ కొన‌సాగింపున‌కు సానుకూలంగా ఉండ‌టంగ గ‌మ‌నార్హం. క‌రోనా మ‌హ‌మ్మారిని మ‌నం త‌రిమికొట్టాలంటే దీర్ఘ‌కాలిక పోరాటానికి సిద్ధ‌మ‌వ్వాలి.ఈ పోరాటంలో మ‌నం ఎలాగైనా గెల‌వాల్సిందే అంటూ వ్యాఖ్య‌నించారు. మరోవైపు, అన్ని విద్యాసంస్థల మూసివేతతో పాటు, ప్రార్థన స్థలాల్లో ప్రజలు సామూహికంగా పాల్గొనే మత కార్యక్రమాలపై విధించిన ఆంక్షలు మే 15 వరకు కొనసాగాలని దేశవ్యాప్తంగా కరోనా ప్రభావాన్ని అంచనా వేసేందుకు ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం(జీఓఎం) మంగళవారం సిఫారసు చేయ‌డం వెనుక లాక్‌డౌన్ కొన‌సాగింపు ఉద్దేశాలు ఉన్నాయ‌ని నెటిజ‌న్లు పేర్కొంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: