చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. ఏపిలో అయినదానికి కానిదానికి జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లేస్తున్న పచ్చమీడియా తెలంగాణాలో మాత్రం కుక్కిన పేనులాగ పడుంది. తెలంగాణాలో కన్నా కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ఏపిలోనే జగన్ ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నది వాస్తవం. మొత్తం బాధితుల సంఖ్య, చనిపోయిన వారి సంఖ్యతో పోల్చుకుంటే ఏపిలో తక్కువనే చెప్పాలి. అయినా పచ్చమీడియాకు ఇదేమీ పట్టడం లేదు.

 

ఇక ప్రస్తుత విషయంలోకి వస్తే రెండు రోజుల క్రితం కేసియార్ మీడయా సమావేశం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఆ సమావేశంలో ప్రధానంగా కేసియార్ మీడియా వైఖరిని దుమ్ము దులిపేశారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఈ స్ధాయిలో మీడియాపై విరుచుకుపడలేదు. తప్పుడు వార్తలు రాస్తే బొందపెడతానని హెచ్చరించాడు. మీడియా రాస్తున్న ప్రతి తప్పుడు వార్తను ప్రభుత్వం రికార్డు చేస్తోందన్నారు. సరైన సమయంలో వాళ్ళపై తీవ్రమైన చర్యలు తీసుకోక తప్పదని వార్నింగులిచ్చాడు.

 

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కేసియార్ నేరుగానే మీడియాకు వార్నింగులు ఇచ్చినా ఒక్క మీడియా కూడా ఆ విషయాన్ని ప్రస్తావించలేదు. చిన్న విషయానికి కూడా జగన్ పై రెచ్చిపోయే పచ్చమీడియా మరి కేసియార్ విషయంలో ఎందుకు మాట్లాడలేదు ? ఏం నోరు పడిపోయిందా ? తాను రాసింది కరెక్టే అని అనిపించినపుడు కేసీయార్ మాట్లాడిన మాటలు తప్పని ఎందుకు ఖండించలేదు ?

 

సిఎం అయిన కొత్తల్లో రెండు మీడియా యాజమాన్యాలకు కేసీయార్ తో  గొడవైంది. అంటే టిఆర్ఎస్ ప్రభుత్వంపై ఎగతాళిగా వ్యాఖ్యలు చేశాయిలేండి. దాంతో కేసీయార్ కు ఒళ్ళు మండిపోయింది. తర్వాత ఏమైందో ఏమో కొన్ని నెలల పాటు రెండు మీడియా చానళ్ళు ఆగిపోవటమే కాకుండా డైలీ సర్క్యులేషన్ కూడా నిలిచిపోయింది. ఆ దెబ్బకు మిగిలిన మీడియా సంస్ధల్లో దాదాపు కేసీయార్ కు దాసోహమనేసింది. బహుశా ఆ విషయం గుర్తుకొచ్చేనేమో ఇపుడు మీడియాపై కేసీయార్ అంతగా నోరుపారేసుకున్నా కిక్కురుమనలేదు.

 

కేసీయార్ పై లేవని నోరు జగన్ పై మాత్రం విరుచుకుపడిపోతోంది. జరగని దాన్ని కూడా జరిగినట్లు, ఎక్కడో ఎవరో చేసిన తప్పును కూడా జగన్ కు ఆపాదించేసి తన కసినంతా తీర్చేసుకుంటున్నాయి. ఎందుకిలా చేస్తోందంటే జగన్ అంటే మీడియాకు లెక్క లేదేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చూడబోతుంటే తెలంగాణాలో మీడియా మొత్తం క్వారంటైన్ సెంటర్లోకి వెళిపోయిందేమో అనే అనుమానలు పెరిగిపోతున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: