కరోనా మనుషుల్లో జాలి గుణాన్ని చంపేస్తుందా అనిపిస్తుంది.. కొన్ని కొన్ని చోట్ల జరిగే ఘటనలను చూస్తుంటే.. ఎక్కడో పుట్టింది.. ఎక్కడెక్కడికో వ్యాపించి, ప్రజల ప్రాణాలను చీమల్లా నలిపేస్తుంది.. ఇప్పుడున్న పరిస్దితుల్లో ఎవరిని ఎప్పుడు ఈ వైరస్ కబళిస్తుందో తెలియడం లేదు.. ఈవైరస్ సోకి కొందరు మరణిస్తుంటే.. మరికొందరు భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. అయితే అత్యంత దయనీయమైన స్దితి ఏంటంటే కరోనా ఆకలి చావులను కూడా కలిగిస్తుంది.. ఇప్పటికే కడుపేదలు ఆకలికి అలమటిస్తున్నారు..

 

 

కరోనా వ్యాధి వ్యాప్తికోసం తీసుకున్న లాక్‌డౌన్ వల్ల శ్రీమంతులకు కష్టం విలువ తెలియదు.. కానీ రెక్కాడితే గానీ డొక్కాడనీ పేదల పరిస్దితులు ఎవరికి పడుతున్నాయి.. మాటల్లో చెప్పినట్లుగా ఎక్కడ అమలు అవుతున్నాయి.. ఇకపోతే ఒక మహిళ కూలీ పొట్టచేత పట్టుకుని బెంగళూరుకు వెళ్లగా, అక్కడ పని లేకపోవడంతో, తిరిగి సొంతూరికి కాలినడకన బయలు దేరిన ఆ అభాగ్యురాలు మధ్యలోనే ఆకలి తట్టుకోలేక ప్రాణాలు విడిచింది. కాగా రాయచూరు జిల్లా సింధనూరు పట్టణంలోని వెంకటేశ్వర్‌ నగర్‌కు చెందిన గంగమ్మ (29) అనే మహిళ తన బతుకు బండిని లాగలేక, ఇలా  అర్ధాంతరంగా తన పయణాన్ని ముగించింది.. ఆ వివరాలు చూస్తే..

 

 

పొట్టచేత పట్టుకుని బెంగళూరు వెళ్లి భవన నిర్మాణ పనుల్లో కూలీ పనిచేస్తున్న వారందరిని, లాక్‌డౌన్‌ నేపధ్యంలో స్వగ్రామాలకు వెళ్లాలని అధికారులు ఆదేశించారు. దీంతో గంగమ్మతో పాటు పలువురు ట్రాక్టర్‌లో బెంగళూరు నుంచి తుమకూరు వరకు వచ్చారు. కానీ అక్కడ వాహనాలను నిలిపేయడంతో, గంగమ్మ మార్చి 30వ తేదీన, కాలినడకన బాటపట్టింది.. ఈ క్రమంలో బళ్లారికి చేరుకునేందుకు మూడు రోజులు పట్టగా, సరైన తిండి, నిద్రలేక తీవ్ర అస్వస్థతకు గురైంది.

 

 

అయితే ఆమె వస్తున్న దారిలో కరోనా భయంతో ఎవరూ ఆమెకు తిండి నీళ్లూ ఇవ్వకపోవడం వల్ల నీరసించిన ఈ మహిళ బళ్లారికి చేరగా అక్కడి అధికారులు స్థానిక ఎస్సీ, ఎస్టీ వసతి నిలయంలో చేర్పించారు. కానీ అప్పటికే తీవ్రంగా నీరసించి పోయిన గంగమ్మ స్పృహ తప్పి పడిపోయింది. దీంతో అధికారులు నిమ్స్‌ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం కన్నుమూసింది... 

మరింత సమాచారం తెలుసుకోండి: