అమెరికాలో క‌రోనా వైర‌స్ క‌ల‌కలం రేపుతోంది. దేశాన్ని అత‌లాకుతలం చేస్తోంది. ఇప్ప‌టికే అమెరికాలో సుమారు నాలుగు ల‌క్ష‌ల మందికిపైగా క‌రోనా బారిన‌ప‌డ‌గా.. సుమారు 13వేల మంది మృతి చెందారు. ఇందులో న్యూయార్క్ న‌గ‌రంలోనే మ‌ర‌ణించిన‌వారి సంఖ్య ఎక్కువ‌గా ఉంది. ఇక్క‌డి ఆస్ప‌త్రుల్లో ఎటుచూసినా క‌రోనా బాధితులు, మృత‌దేహాలే క‌నిపిస్తున్నాయి. ప్ర‌తీరోజు వంద‌ల సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. ఒక‌దశలో మృత‌దేహాల‌ను ఎక్క‌డ పెట్టాలో కూడా తెలియ‌ని ద‌య‌నీయ‌స్థితి న‌గ‌రంలో క‌నిపిస్తోంద‌ని ప‌లువురు విశ్లేష‌కులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో న‌గ‌రం మొత్తం క‌న్నీటిసంద్రంలో మునిగిపోయింది. ప్ర‌జ‌లు ఏపూట‌కాపూట బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతున్నారు. అయితే.. ఇక్క‌డ  మ‌రొక విష‌యం ఏమిటంటే.. న్యూయార్క్ న‌గ‌రంలో క‌రోనా వైర‌స్‌ మ‌ర‌ణాల సంఖ్య‌   9/11 ఉగ్ర‌దాడి మ‌ర‌ణాల సంఖ్య‌ను దాటిపోయింది. 

 

న్యూయార్క్ నగరంలో ఇప్ప‌టివ‌ర‌కు కోవిడ్ -19తో నాలుగు వేల మంది మ‌ర‌ణించారు. అమెరికా గడ్డపై జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడి కంటే వెయ్యిమందికిపైగా క‌రోనాతో మృతి చెంద‌డం గ‌మ‌నార్హం. సెప్టెంబ‌ర్ 11, 2001లో జ‌రిగిన ఉగ్ర‌దాడిలో 2,977 మంది మరణించారు. ఈ దాడి అప్ప‌ట్లో తీవ్ర‌క‌ల‌క‌లం రేపింది. ఉగ్ర‌వాదులు హైజాక్ చేసిన‌ విమానాలు జంట టవర్ల‌ను ఢీకొట్ట‌డంతో ఈ ఘోర‌మైన ఘ‌ట‌న జ‌రిగింది. అయితే.. ఆ త‌ర్వాత అమెరికాలో ఇన్ని మ‌ర‌ణాలు ఎన్న‌డూ సంభ‌వించ‌లేదు. ఇప్పుడు క‌రోనా వైర‌స్‌తో అమెరికా క‌న్నీటిసంద్రంలో మునిగిపోయింది. రోజుకు వంద‌ల సంఖ్య‌లో పౌరులు మ‌ర‌ణిస్తున్నారు. మంగ‌ళ‌వారం ఒక్క‌రోజే న్యూయార్క్‌లో 731మంది మ‌ర‌ణించారు. దీంతో ఆ స్టేట్‌లో మృతి చెందిన వారి సంఖ్య 5,500కు చేరుకుంది. కాగా, అమెరికా పౌరుల‌ను కాపాడేందుకు అధ్య‌క్షుడు ట్రంప్ అనేక చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. కాగా, ప్ర‌పంచంలోనే అమెరికాలో అత్య‌దిక క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. ఇప్ప‌టికే అమెరికాలో మ‌ర‌ణాల సంఖ్య ల‌క్ష నుంచి రెండు ల‌క్ష‌లకుపైగా ఉండొచ్చ‌ని వైట్‌హౌస్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన విషం తెలిసిందే. ఇది ఆ దేశ ప్ర‌జ‌ల‌ను తీవ్ర ఆందోళ‌న‌కు గురిచేస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: