దేశంలో ప్రతిరోజూ కరోనా వైరస్ వ్యాప్తి జరుగుతూనే ఉంది.. ప్రస్తుతం లాక్ డౌన్ చేసినప్పటికీ ఈ కరోనా వ్యాప్తిని మాత్రం అరికట్ట లేక పోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కరోనా గురించి ఎన్నో జాగ్రత్తలు పాటిస్తున్న రోజూ పెరిగిపోతూనే ఉన్నాయి.  తాజాగా ఏపిలో 314 కి కరోనా కేసులు పెరిగిపోయాయి.  ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏపిలో దీనిపై సీరియస్ ఫోకస్ పెట్టారు.  సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షలు ఏర్పాటు చేస్తున్నారు. వేగవంతంగా పరీక్షలు నిర్వహించేందుకు వలంటీర్లు, ఏఎన్‌ఎంలు, ఆశా వర్కర్లు ఇంటింటి సర్వే ద్వారా వ్యాధి లక్షణాలు ఉన్న వారి గుర్తించాలని ఆయన సూచించారు. వీరిలో ఎవరెవరికి పరీక్షలు చేయించాలన్న దానిపై వైద్యులు నిర్ధారిస్తున్నారు. 

 

 ఐసోలేషన్‌లో ఉన్న వారు ఎవరైనా ఫోన్‌ చేసి వైద్యం పొందవచ్చు. క్వారంటైన్, ఐసోలేషన్‌ క్యాంపుల్లో సదుపాయాలను మెరుగు పరచాలని.... సదుపాయాల్లో నాణ్యత ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. త్వరలో వీరందరికీ కూడా పరీక్షలు నిర్వహిస్తారు. విశాఖపట్నం, గుంటూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో ప్రస్తుతం ఉన్న ల్యాబ్‌ల సామర్థ్యాన్ని పెంచుతోంది.

 

స్వచ్ఛంద సంస్థల ద్వారా టెలీ మెడిసిన్‌ సర్వీసులు అందించడానికి ఏర్పాట్లు చేయాలని కోరారు.  ఇంటింటికీ సర్వే చేసేవారికి ప్రతి ఒక్కరూ సంపూర్ణంగా సహకరించాలని.. వారు కోరి న వివరాలు తప్పకుండా ఇవ్వాలని అన్నారు.  అయితే కరోనా అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. . ఈ విషయంలో రూపొందించుకున్న స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ) ప్రకారం ముందు కెళ్లాలన్నారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: