ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన ఈ క‌రోనా వైర‌స్ ప్ర‌స్తుతం ప్ర‌జ‌లంద‌రినీ కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. క‌రోనాకు వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. నివార‌ణ‌పైనే అంద‌రూ దృష్టి పెట్టారు. అలాగే క‌రోనా దెబ్బ‌కు దేశ‌దేశాలు లాక్‌డౌన్ అవ్వ‌డ‌మే కాకుండా.. క‌ఠ‌న చ‌ర్య‌లు కూడా చేప‌ట్టారు. అయితే లాక్ డౌన్ నిబంధనలు అమలవుతున్న వేళ, ఓ హిందూ మహిళ మరణించగా, కరోనా భయంతో బంధువులు ఎవరూ అంత్యక్రియలకు హాజరు కాలేక‌పోయారు. ఇది తెలుసుకున్న స్థానిక ముస్లిం సోదరులు పాడెమోసి, అంత్యక్రియలకు సహకరించి, తమలోని మానవత్వాన్ని చాటుకున్నారు. 

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 65 ఏళ్ల  ఓ హిందూ మ‌హిళ మ‌ర‌ణించింది. ఆమెకు ఇద్దరు కుమారులు ఉండగా, వారిద్దరూ ఆమె మరణించిన తరువాత ఇంటికి చేరుకున్నారు. అయితే లాక్‌డౌన్ కార‌ణంగా బంధుమిత్రులు ఎవరూ అంత్యక్రియలకు రాలేకపోయారు. దీంతో చుట్టుపక్కల ఉన్న ముస్లిం యువకులు, మాస్క్ లు ధరించి, మృతురాలి కుమారులకు సహకరించారు. దాదాపు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్మశానానికి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఏ విధమైన వాహనమూ అందుబాటులో లేకపోవడంతో, తమ భుజాలపై పాడెను మోశారు. 

 

అంతేకాకుండా.. తమకు ఆ మహిళ చిన్నప్పటి నుంచి తెలుసునని, ఆమె మరణిస్తే, అంత్యక్రియలకు సహకరించడం తమ విధిగా భావించామని ముస్లిం యువకులు తెలిపారు. ఇక ముస్లింలు చూపిన మానవత్వంపై రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత కమల్ నాథ్ ప్రశంసల జ‌ల్లు కురిపించారు. వీరు సమాజానికి ఓ ఉదాహరణగా నిలిచారని కొనియాడారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వైర‌ల్ అవుతున్నాయి. ఇది చూసిన‌ నెటిజ‌న్లు సైతం ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: