ప్రపంచంలో కరోనా కరాళ నృత్యం చేస్తుంది.  అమెరికా లాంటి అగ్ర రాజ్యంలో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు.  ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ ఇలాంటి దేశాల్లో మొన్నటి వరకు మారణహోమం జరిగినా..  ఇప్పుడు కాస్త తగ్గు ముఖం పట్టాయని అంటున్నారు.  చైనాలోని పుహాన్ లో పుట్టుకు వచ్చిన ఈ భయంకరమైన వైరస్ ఇంత బీభత్సం సృష్టిస్తుందని ఎవరూ ఊహించలేదు.  మన దేశంలో గత 24 నుంచి పూర్తి స్థాయిలో లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు ఇంటి పట్టున ఉంటున్నారు. అయితే కొంత మంది లాక్ డౌన్ ఉల్లంఘన చేసిన వారికి బరిత పూజ చేసి ఇంటి పట్టున ఉండేలా కఠిన చర్యలు తీసుకంటున్నారు పోలీసులు. 

 

రాత్రి.. పగలు అనే తేడా లేకుండా పోలీసుల చేస్తున్న సేవలు ఎప్పటికీ మర్చిపోలేని విధంగా ఉన్నాయి.  ఓ వైపు డాక్టర్లు, పారిశుద్ధ్య కార్మికులు సైతం మేమున్నామం అంటూ ఎన్ని కష్టాలు పడుతున్నారో రోజూ చూస్తునే ఉన్నాం.   కాగా,  లాక్ డౌన్ ను విజయవంతంగా అమలు చేయడంలో పోలీసులదే ప్రధాన పాత్ర అని చెప్పడంలో ఎంతమాత్రమూ సందేహం లేదు. తమ విధి నిర్వహణలో భాగంగా, వైరస్ సోకుతుందన్న భయాలను పక్కనబెట్టి, ఇంటికి దూరమై, అనునిత్యమూ శ్రమిస్తున్న పోలీసులపై నాగపూర్ లోని గట్టిఖాదన్ ప్రాంత వాసులు పూల వర్షం కురిపించారు. 

 

ఈ మద్య పారిశుద్ధ్య కార్మికులకు డబ్బులు ఉన్న నోట్లతో పూలదండలు వేసి శాలువాలతో సన్మానం చేస్తున్నారు.  మరోచోట డాక్లర్లకు సన్మానం చేస్తున్నారు.  కరోనా వైరస్ వ్యాప్తిపై ప్రజల్లో అవగాహన పెంచుతూ, పోలీసులు మార్చ్ ఫాస్ట్ చేస్తున్న వేళ ఈ ఘటన జరుగగా, ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను నాగపూర్ పోలీసుల అధికారిక ట్విట్టర్ ఖాతా షేర్ చేస్తూ, ప్రజలకు, తమ టీమ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే జోన్-2 డీసీపీ ఎస్ వనిత నేతృత్వంలో రూట్ మార్చ్ నిర్వహిస్తున్న వేళ ఈ ఘటన జరిగినట్టు పేర్కొంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: