కరోనా వైరస్ విజృంభిస్తుంది  ప్రపంచం మొత్తం వణికిపోతోంది. ప్రపంచ దేశాలను ప్రాణభయంతో వనికిస్తు... ఎంతో మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంటోంది కరోనా వైరస్ . ప్రపంచం మొత్తం ప్రాణభయంతో బతకడమే కాదు... కంటికి కనిపించని శత్రువుతో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ ప్రపంచ మహమ్మారి... ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిలో కోరలు చాస్తూ  భారీ ప్రాణ నష్టాన్ని కలిగిస్తుంది. కొన్ని దేశాల్లో అయితే రోజురోజుకూ పరిస్థితి చేయి దాటి పోతుంది. ఇక ఈ వైరస్ కు  విరుగుడు ఏదీ లేకపోవడం నివారణ ఒక్కటే మార్గం అవ్వడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు . 

 

 

 అయితే కంటికి కనిపించకుండా దాడి చేసి  ఈ మహమ్మారి వైరస్ ప్రాణాలను హరించుకు పోతుంది అని తెలిసినప్పటికీ తమ ప్రాణాలను పణంగా పెట్టి మరి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ముందుకు వస్తున్నారు డాక్టర్లు పోలీసులు. మృత్యువుకు ఎదురు నిలబడి పోరాటం చేస్తున్నారు. ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ప్రస్తుతం డాక్టర్లు పోలీసులు చేస్తున్న సేవ వెలకట్టలేనిది అనే చెప్పొచ్చు. ప్రస్తుతం ప్రపంచ మహమ్మారికి భయపడి ప్రజలందరూ ఇంటికే పరిమితం అయిన వేళ... ప్రజల ప్రాణాలను కాపాడడానికి.. మహమ్మారి వైరస్ బారి నుంచి ప్రపంచాన్ని రక్షించడానికి నడుం బిగించారు డాక్టర్లు . 

 

 

కరోనా వైరస్ కి  ఎదురు నిలబడి పోరాడుతున్నా డాక్టర్లను ఎంతమంది ప్రశంసిస్తున్న  విషయం తెలిసిందే. అయితే కరోనా  వైరస్ పై పోరాటంలో భాగంగా ఎంతగానో పోరాటం చేస్తున్న హెల్త్ కేర్ వర్కర్స్ సంక్షేమార్థం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.  వన్ వరల్డ్ టుగెదర్ ఎట్ హోం అనే పేరుతో ఈ సమావేశం నిర్వహించనుంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ కార్యక్రమంలో రాజకీయ క్రీడా రంగ ప్రముఖులతో పాటు... సినీ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ నుంచి షారుక్ ఖాన్ ప్రియాంక చోప్రా లకు  ఆహ్వానం అందింది.. ఇక హాలీవుడ్ నుంచి క్రిస్ మార్టిన్,  లేడీగాగా పాల్గొననున్నారు ఈ సమావేశం ఏప్రిల్ 18న ప్రారంభం కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: