కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకి పెద్ద అన్న అమెరికా విలవిల్లాడిపోతోంది. మంగళవారం నాటికి అక్కడ మృతుల సంఖ్య 12,700 కి చేరింది. నిజానికి నిన్న ఒక్కరోజే అమెరికా అంత కలిపి 1,900 మరణాలు సంభవించడంతో అలజడి సృష్టిస్తుంది. ఇంకోవైపు కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య కూడా రోజురోజుకి పెరుగుతూనే ఉంది. అయితే ఇప్పటి వరకు నాలుగు లక్షల మంది పైగానే ఈ వైరస్ బారిన పడ్డారు. ఇందులో మొత్తం దీని బారి నుండి 22,020 మంది కోలుకోగా, 12,878 మంది చని పోయారు.

 


ఇది ఇలా ఉండగా అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మంచి ఫలిస్తున్నాయని అధ్యక్షుడు ట్రంప్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశంలో పరిస్థితులు గతంలో ఉన్నంత విషమంగా లేవని ఆయన వ్యాఖ్యానించారు. అయితే కొన్ని రోజుల క్రితం అంచనా వేసిన స్థాయిలో మరణాలు ఉండవని ఆయన ఊరటనిచ్చే విషయాన్ని తెలిపారు. కాకపోతే ఇదివరకే ఒక లక్ష నుంచి 2 లక్షల మందిని మహమ్మారి దెబ్బకి బలి అవుతారని అవకాశం ఉందని ట్రంప్ ఇటీవల ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే. 

 

 

అయితే తాజాగా ఆయన తన ప్రకటనను సవరించారు. ఆయన ఇదివరకు వేసిన అంచనా వేసిన కంటే మృతుల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని ఆయన చెప్పారు. కరోనా పరిస్థితి తీవ్రంగా ఉన్న న్యూయార్క్ రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 5,400 మంది మృత్యు వాత పడ్డారు. అలాగే అక్కడ ఏకంగా 1,38,000 కేసులు నమోదయ్యా యి. పక్క రాష్ట్రమైన న్యూజెర్సీలో కూడా 44,416 మందికి వైరస్ సోకగా అందులో 1,200 మంది మృతి చెందారు.  ఈ దెబ్బతో అమెరికాలో వైరస్ కట్టడికి పటిష్టమైన చర్యలు చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు దేశంలోని 97 % జనాభా ప్రభుత్వ నిబంధనల పరిధిలోనే  ఉన్నారు. ఇక రంగంలో దిగిన దేశ సైన్యం అవసరమైన చోట తాత్కాలిక వైద్యన్ని అందిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: