దేశంలో మొన్నటి వరకు కరోనా కేసులు కేవలం విదేశాల నంచి వచ్చిన వారికే ఎక్కువ సోకిందని అన్నారు. అయితే  ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో జమాత్ సమావేశంలో పాల్గొన్న వేలాది మంది వివిధ ప్రదేశాలకు పోవడం.. వారికి కరోనా వైరస్ ఉండటంతో దేశంలో కేసులు మరిన్ని పెరిగిపోవడం ప్రారంభం అయ్యాయి.  దేశం వ్యాప్తంగా ఈ సమావేశాలకు వెళ్లి వచ్చిన వారిని స్వచ్ఛందంగా వచ్చి ట్రీట్ మెంట్ తీసుకోవాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్న విషయం తెలిసిందే.

 

అయితే తబ్లిగ్ జమాత్ చీఫ్ మౌలానా ముహమ్మద్ సాద్ అప్పటి నుంచి కంటికి కనిపించకుండా తిరుగుతున్నారని.. ఆయన ఇంకా ఎక్కడెక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడిన విషయం గురించి తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నాలు మొదులు పెట్టారు.  ఆప్పటి నుంచి ఆయన ఆచూకీ కోసం వెతుకుతున్నారు.   తాజాగా పరారీలో ఉన్న తబ్లిగ్ జమాత్ చీఫ్ మౌలానా ముహమ్మద్ సాద్ ఆచూకీని ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు బుధవారం ఎట్టకేలకు కనుగొన్నారు. 

 

ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌లో జమాత్ సమావేశం నిర్వహించి, దేశవ్యాప్తంగా ఈ వైరస్ ప్రబలేందుకు కారణమైన జమాత్ చీఫ్ సాద్‌పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.   మొత్తానికి ఢిల్లీలోని జాకీర్ నగర్ ప్రాంతంలోని తన నివాసంలో మౌలానా సాద్ క్వారంటైన్‌లో ఉండగా ఢిల్లీ పోలీసులు బుధవారం కనుగొన్నారు. ఢిల్లీతోపాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్ నగర్, షామ్లీ ప్రాంతాల్లో మౌలానా కోసం ఢిల్లీ క్రైంబ్రాంచ్ పోలీసులు తీవ్రంగా గాలించారు.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: