ఆంధ్రప్రదేశ్ లో రోజురోజుకి చాపకింద నీరులా కరోనా వైరస్ తీవ్రత ఎక్కువ ఐతుంది. రాష్ట్రంలో చాలామంది ఢిల్లీలో జరిగిన ప్రధానాలకి వెళ్లి వచ్చినవారు ఎక్కువ ఉండడంతో అక్కడ రాష్ట్రంలో కేసులు రోజుజుకి ఎక్కువ అవుతున్నాయి. నిజానికి ఈ దెబ్బకి ఒక్క కర్నూల్ జిల్లాలోనే దెగ్గరదగ్గర 200 మంది వరకు ఆ ప్రధానాలకు వెళ్లి వచ్చినవారు ఉన్నారు. దీనితో మోడిటీ వరం లో కేవలం ఒక్క కేసు మాత్రమే నమోదవ్వగా మరుసటి వారంలో ఏ జిల్లాలో లేని విధంగా ఏకంగా 70 కేసులు పైన ఒక్క కర్నూల్ జిల్లాలోనే కావడం గమనార్హం. 

 

దీనితో కర్నూలు జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కాస్త ఎక్కువగానే అప్రమత్తమైంది. కోవిడ్‌ - 19 వైరస్‌ విస్తరించకుండా తీసుకుంటున్న చర్యలకు ఇప్పుడు సాంకేతికతను కూడా జోడించింది. ఆన్‌ లైన్‌ లో పర్యవేక్షించే ఏర్పాట్లను పోలీసుల బృందం చేసింది. కర్నూల్ జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్‌ ఆడిటోరియం పక్కన ఇందు కోసం ప్రత్యేకంగా కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేయడం జరిగింది. 

 

ముఖ్యంగా రెడ్‌ జోన్‌ ప్రాంతాలను గూగుల్‌ మ్యాప్‌ లో జియో ట్యాగింగ్‌  చేశారు వీరు. ఎవరైనా పాజిటివ్‌ కేసు ఉన్న వ్యక్తులు నివసించే పరిసరాల్లో కిలో మీటర్‌ దూరంలో పూర్తిగా నిర్భందాన్ని అమలు పరుస్తున్నారు. దీనితో ఆయా ప్రాంతాలకు బయటి వారు ఎవరూ వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఆ ఏరియాలోని చిన్నచిన్న వ్యాపార దుకాణాలతో పాటుగా పట్టణంలోని పెట్రోల్‌ బంకులన్నింటినీ కూడా మూయించేసారు. 

 

మొత్తంగా కర్నూల్ జిల్లాలో 27 కంటైన్మెంట్‌ జోన్లు ఉన్నాయి. అక్కడ పరిధిలోని  ప్రజలు నిత్యావసరాల పేరుతో బయటకు వచ్చి వీధుల్లో తిరగకుండా ఎక్కడికక్కడ బారీకేడ్లు ఏర్పాటు చేసి లాక్‌ డౌన్‌ ను పూర్తిగా కఠినతరం చేసారు. ఎక్కువగా కేసులు నమోదైన ప్రాంతాల్లో కర్ఫ్యూ అమలు పరుస్తున్నారు. ఆయా ప్రాంతాలలో బయటకు రాకుండా కరోనా నియంత్రణకు సహకరించాలని ప్రజలను పోలీసు అధికారులు ఆదేశించారు. అంతే కాకుండా ఎవరైనా రూల్స్ ని అతిక్రమిస్తే మాత్రం పోలీస్ కస్టడీ లోకి తీసుకొంటారని చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: