ఇపుడిదే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. అసలు కరోనా వైరస్ ప్రపంచానికి నేర్పిన పాఠాలు ఏమిటి ? నేర్చుకోవాల్సిన పాఠాలేమిటి ? అనే విషయమై యావత్ దేశాలు చాలా సీరియస్ గా ఆలోచించాలి. పాఠాల నుండి గుణపాఠాలు నేర్చుకోకపోతే వాళ్ళ ఖర్మకు వాళ్ళని వదిలేయాల్సిందే. ఇంతకీ విషయం ఏమిటంటే ప్రపంచ దేశాలను కరోనా వైరస్ ఎంతగా వణికించేస్తోందో అందరికీ తెలిసిందే. వైరస్ దెబ్బకు ఆయా దేశాలు ఎప్పటికి కోలుకుంటుందో ఎవరూ చెప్పలేకున్నారు. అయితే  వైరస్ కు పుట్టినల్లైన చైనా మాత్రం నెలల వ్యవధిలోనే కోలుకుందనే చెప్పాలి.

 

చైనా కోలుకుందనేందుకు నిదర్శనం ఏమిటయ్యా అంటే వివిధ దేశాలకు అత్యవసరమైన వైద్య పరికరాలను సరఫరా చేస్తుండటమే. అమెరికా, ఫ్రాన్స్, ఇండియా, బ్రెజిల్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, ఇరాక్ లాంటి దేశాలు చైనా నుండి వెంటిలేటర్లు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, మాస్కుల్లాంటి వాటిని చైనా నుండే దిగుమతి చేసుకుంటున్నాయి.  ఇపుడు కూడా మనదేశం 1.7 లక్షల పిపిఇలను చైనా నుండి తెప్పించుకున్నది. అసలు ఆ దేశాలకు ఇంతటి దుర్ఘతి ఎందుకు పట్టింది ? అన్నదే ఇపుడు అలసలైన ప్రశ్న.

 

సరే ఈ ప్రశ్న వేసుకున్నందు వల్ల జరిగే ఉపయోగం ఏమీ లేదు కాబట్టే భవిష్యత్తులో ఏమి చేయాలనేది ఆలోచించుకోవాలి. ఇంతకీ చేయాల్సిందేమిటంటే పైన చెప్పిన పరికరాలే కాదు ప్రతి పరికరాన్ని ఏ దేశానికి ఆ దేశమే తయారు చేసుకోవాలి. ఇపుడు గుండిసూది నుండి బోయింగ్ విమానం విడిపరకరాల వరకూ చాలా దేశాలు చైనా మీదే ఆధారపడ్డాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక నుండి చైనా మీద ఆధారపడటం మానేయాలి.

 

అంటే అవకాశం ఉన్నంతలో ప్రతి వస్తువును ఆయా దేశాలే తయారు చేసుకోవటం మొదలుపెట్టాలి. అప్పుడు కరోనా వైరస్ లాంటి ఉపధృవం వచ్చినపుడు ఏ దేశానికాదేశమే స్వయం సిద్ధమవుతుంది. మరీ పేదదేశాల సంగతి వదిలిపెట్టేసినా మిగిలిన దేశాలు ఇప్పటి నుండే ప్రయత్నాలు చేయాల్సిందే. ఆరు మాసాలు వైరస్ దెబ్బకు ఇబ్బంది పడినా వెంటనే కోలుకుని ఇతర దేశాలకు వైద్య పరికరాలను చైనా ఎలాగ సరఫరా చేయగలుగుతోందో ఆలోచించాలి.

 

కాబట్టి పట్టుదల, వస్తూత్పత్తి, పాండమిక్ (క్రైసిస్) మ్యానేజ్మెంట్ లాంటి అంశాల్లో ప్రపంచదేశాలు చైనానే ఆదర్శంగా తీసుకోవాలి. ఈ రొజు కరోనా వైరస్ దెబ్బకు ప్రంపచ దేశాలు తల్లకిందులైపోతున్నాయి.  రేపటి రోజున ఇంతకు మించిన వైరస్ రాదనేందుక గ్యారెంటీ ఏమీ లేదు కదా ? ఎటువంటి ఉపధృవం వచ్చినా తట్టుకునేందుకు వీలుగానే సర్వదేశాలు సన్నంద్ధంగా ఉండాలి. అందుకే దేశాలు వాటికవే స్వయంసిద్ధమవ్వాలని చెప్పేది. మరి ప్రపంచదేశాలు ముఖ్యంగా మనదేశం ఎటువంటి పాఠం నేర్చుకుంటుందో చూద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి: