ప్రస్తుతం యావత్ ప్రపంచం కరోనా వైరస్ భయంతో అతలాకుతలమవుతోంది.  కరోనా వైరస్ మహమ్మారికి అరికట్టేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ విధానాన్ని అమల్లోకి తీసుకుని రావడం జరిగింది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ పర్యాటక ప్రదేశాలు, పార్కులు, సినిమా థియేటర్లు, ప్రముఖ మాల్స్ అన్నీ కూడా మూతపడ్డాయి. ఇది ఇలా ఉండగా కొన్ని ప్రాంతాలలో మాత్రం కొంతమంది అసలు లాక్ డౌన్ పాటించడంలేదు. నిబంధలను అసలు పాటించటం లేదు. ఈ నిబంధనలు వ్యతిరేకంగా చేసే వారికోసం హైదరాబాద్ పోలీస్ అధికారులు వినూత్నరీతిలో డ్రోన్ కెమెరాల ద్వారా వారిని పట్టుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. ముఖ్యంగా పాజిటివ్ కేసులు ఎక్కువ సంఖ్యలో నమోదైన ప్రాంతాలలో పోలీస్ అధికారులు ఎక్కువగా నిఘా పెట్టారని చెప్పాలి. 

 


కేంద్ర ప్రభుత్వం లాక్ డోన్ అమలు చేస్తూ ప్రజలందరూ కూడా ఇంట్లోనే ఉంటూ జాగ్రత్త పడాలని ఎన్ని సూచనలు ఇస్తున్నా, కానీ కొంతమంది అసలు వాటిని పట్టించుకోవడం లేదు. ఇలాంటి వారి కోసమే చిన్నచిన్న వీధులలో నిబంధనలు ఉల్లంఘించే వారికోసమే డ్రోన్ కెమెరా సహాయం ద్వారా మెగా మరింత పెంచడం జరిగింది.. ఇలా డ్రోన్ కెమెరాల ద్వారా  లైవ్ మానిటరింగ్ చేయడం వల్ల ప్రజలు ఎక్కువగా ఎక్కడ ఉన్నారో అన్న విషయం పట్టేందుకు చాలా మంచి అవకాశం అని భావిస్తున్నారు పోలీస్ అధికారులు.  అలాగే ఈ తరుణంలోనే కొంతమందిని అదుపులోకి కూడా తీసుకోవచ్చు అని భావిస్తున్నారు. ఇలా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద గుమిగూడి ఉన్న ప్రజల పై కేసు నమోదు కూడా చేస్తున్నారు.

 

 

ఇందులో భాగంగానే హైదరాబాద్ లోని బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అధికారులు డ్రోన్ కెమెరా సహాయం ద్వారా కొంతమందిని పసిగట్టడంతో అక్కడి వారంతా పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు పోలీస్ అధికారులు మీడియాకు ఇవ్వడం జరిగింది. అలాగే  ఎక్కువ ప్రజలు ఒకే చోట ఉన్నట్లు గమనిస్తే సమాచారం ఇవ్వాలని పోలీస్ అధికారులు సూచిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు సైబరాబాద్ కమిషనరేట్ ప్రాంతాలలో మెయిన్ రోడ్ టౌన్ కెమెరాల సహాయంతో సమీక్ష నిర్వహిస్తున్నామని కమిషనర్ వీసీ సజ్జనార్ తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: