ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాస్తూ   ఎంతో మందిని పొట్టన పెట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో  దాదాపు నిర్బంధంలోకి వెళ్ళిపోయారు. ఇక కొన్ని  దేశాల్లో అయితే పరిస్థితుల్లో రోజురోజుకు చేయి దాటిపోవడంతో.. మరిన్ని కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి  ఆయా దేశాల ప్రభుత్వాలు. ముఖ్యంగా ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ తన దేశాన్ని నిర్బంధంలోకి తీసుకుని రవాణా వ్యవస్థను పూర్తిగా రద్దు చేయడంతోపాటు... అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని సేవలను మూసివేసి నిర్ణయాలు తీసుకున్నారు. ప్రజలు ఇంటికే పరిమితం కావాలని సూచిస్తుంది. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు నిర్బంధం  లోకి వెళ్ళిపోయి రవాణా వ్యవస్థను పూర్తిగా రద్దు చేసిన తరుణంలో... చాలా మంది ఇతర దేశాలకు చెందిన వారు ఆయా దేశాల్లో ఇరుక్కుపోయారు . 

 

 కరోనా ఎఫెక్ట్ వల్ల  ప్రపంచ దేశాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయిన  నేపథ్యంలో... తమ తమ దేశాలకు వెళ్ళలేక ఆయా  దేశప్రజలు  ఇతర దేశాల్లోనే ఉండి పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే భారత దేశానికి చెందిన చాలామంది విదేశాల్లో చిక్కుకొని ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అదే విధంగా భారత దేశంలో కూడా ఇతర దేశాలకు చెందిన వారు చాలామంది ఇరుక్కు పోయారు. రవాణా వ్యవస్థ పూర్తిగా రద్దు కావడంతో వారు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. భారతదేశంలో ఇరుక్కుపోయిన వాళ్లు అమెరికన్లు కూడా చాలామంది ఉన్నారు. 

 

 

 అయితే భారత్ లో ఇరుక్కుపోయిన అమెరికన్ల  కోసం అమెరికా ప్రభుత్వం కొన్ని చర్యలు కూడా చేపట్టింది. ఇప్పుడు వరకు 13 వందల మంది అమెరికను  భారత్ నుంచి అమెరికా కు రప్పించింది అమెరికా ప్రభుత్వం. అయితే ఈ వారం రోజుల్లో మరో 5 ప్రత్యేక విమానాల్లో  కొంతమందిని స్వదేశానికి తీసుకెళ్లనునట్లు సమాచారం. అయితే ఇక్కడ వరకు అంతా బాగానే ఉన్నా... భారత్ లో చిక్కుకున్న అమెరికన్లు  తన స్వదేశానికి వెళ్లడానికి మాత్రం వెనకడుగు వేస్తున్నారు. భారత్లో ఉన్న యూఎస్ ఎంబస్సి  లో ఇప్పటి వరకు 7 వేల మంది అమెరికన్లు రిజిస్టర్ చేసుకున్నట్లు  సౌత్ అండ్ సెంట్రల్ ఏషియాకు  సెక్రటరీ అధికారి తెలిపారు. అయితే అమెరికాలో కరోనా  వైరస్ ఎక్కువ ఉండటం...  కరోనా  వైరస్ కారణంగా మరణాల సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల అమెరికా వెళ్లేందుకు వెనకడుగు వేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: