దేశంలో కరోనా కేసులు పెరగడంతో కేంద్ర ఆరోగ్య శాఖ మ‌రో  కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. కరోనా వైరస్ తో బాధ‌ప‌డుతున్న‌వారికి వైద్యం అంద‌జేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆస్పత్రులను మూడు కేటగిరీలుగా విభ‌జ‌న‌ చేసింది.దీని వల్ల దేశంలో కరోనా కేసులు, ట్రీట్‌మెంట్‌పై కేంద్ర, రాష్ట్రాలకు ఎప్పటికప్పుడు క్లారిటీ వస్తుంది. అలాగే... కరోనా స్థాయి కూడా ఈజీగా తెలుస్తుంద‌ని వైద్యాధికారులు భావిస్తున్నారు. ఎక్కువ కేసుల్లో అనుమానితులు, స్వల్ప లక్షణాలు ఉన్నవే ఉంటుండ‌టంతో అలాంటి ఆస్పత్రుల సంఖ్య ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వ భావించింది. 

 

ఇలాంటి వాటి కోసం హాస్టళ్లు, స్కూళ్ల ప్రాంగణాలు, త‌దిత‌ర భ‌వ‌న స‌ముదాయాల‌ను తాత్కాలిక ఆస్ప‌త్రులుగా వాడుకోవాల‌ని కేంద్రం రాష్ట్రాల‌కు సూచిస్తోంది. కేంద్ర ప్ర‌భుత్వం జారీ చేసిన గైడ్‌లైన్స్ ప్ర‌కారం..  మొదటి రకంలో కొవిడ్ కేర్ సెంటర్లు.. అనుమానిత కేసులు,  వైరస్ లక్షణాలు ఉన్న కేసుల‌కు సంబంధించిన వైద్యం అంద‌జేస్తాయి. రెండోవి... కొవిడ్ హెల్త్ సెంటర్లు... వీటిలో ఆల్రెడీ కరోనా పాజిటివ్ లక్షణాలు కాస్త ఎక్కువగానే ఉన్నవారికీ, వ్యాధి మధ్యస్త స్థాయిలో ఉన్నవారికి వైద్యం అంద‌జేస్తారు. మూడో కేట‌గిరిఇలో డెడికేటెడ్ కొవిడ్ హాస్పిటల్స్ సేవ‌లందిస్తాయి. 

 

అంటే తెలంగాణలో గాంధీ ఆస్పత్రి లాంటివి. ఇక్కడ తీవ్రమైన కేసులు, క్రిటికల్ కండీషన్ కేసులకు సంబంధించిన పూర్తి చికిత్స ఉంటుంది. ఇలా దేశంలోని అన్ని రాష్ట్రాలూ, కేంద్రపాలిత ప్రాంతాలూ తమ దగ్గరున్న ఆస్పత్రులను మూడుగా విభజించుకొని... పేషెంట్లను కూడా అలా విభజించమని మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు పంపింది. కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులకు కూడా ఈ రూల్ వర్తిస్తుంది. అయితే కోవిడ్ హెల్త్‌కేర్ ఆస్ప‌త్రుల్లో  అనుమానితులు టెస్టింగ్ కోసం వస్తే... వారికి 100 శాతం కరోనా సోకకుండా చేయాల్సి ఉంటుంద‌ని పేర్కొంది. 

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: