కేవలం తబ్లీజీ జమాత్ ప్రార్థనల్లో పాల్గొన్న వారి కారణంగా భారతదేశంలో 3000 పై చిలుకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికీ ఆ మతపరమైన సదస్సులో పాల్గొన్నవారు ఎవరెవరితో కాంటాక్ట్ లో ఉన్నారో తెలియని పరిస్థితి ఏర్పడింది. రోజుకి వందలమంది కరోనా రోగులు బయట పడటం... వారిలోని 99% మంది తబ్లీజీ ప్రార్థనల్లో పాల్గొన్నవారే ఉండటం గమనార్హం.


పూణే లో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పుకుంటే... మార్చి 31న ఓ ఆటో డ్రైవర్ కి రోడ్డు ప్రమాదం జరగగా కుటుంబ సభ్యులు అతడిని పింప్రి లోని ఓ ప్రముఖ హాస్పిటల్ కి తరలించారు. అసలే రోజులు బాలేదు కాబట్టి ఆటోడ్రైవర్ తల్లిని 'మీ కొడుకు ఢిల్లీ మతపరమైన ప్రార్థనకు వెళ్ళాడా?' అని ప్రశ్నించారు వైద్యులు. సమాధానంగా ఆమె లేదు అని చెప్పేసింది. ఆమె మాటలను నమ్మిన వైద్యులు... అతనిని వెంటనే ఐసీయూ కి తరలించి ఆపరేషన్ చేసారు.


అయితే ఆపరేషన్ ముగిసిన రెండు రోజుల తర్వాత ఆటో డ్రైవర్ కి బాగా జ్వరం వచ్చింది. దీంతో అనుమానం వచ్చిన సదరు ఆసుపత్రి యంత్రాంగం ఆటో డ్రైవర్ కి కోవిడ్ 19 పరీక్షలు చేయగా... కరోనా వైరస్ సోకిందని తేలింది. దాంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయిన ఆసుపత్రి సిబ్బంది అబద్దం చెప్పిన తల్లి దగ్గరికి వెళ్లి నిలదీయగా... తన కొడుకు ఢిల్లీ లోని తబ్లీజీ జమాత్ కి వెళ్లాడని, అది చెబితే చికిత్స చేయరేమోననే భయంతో అబద్దం చెప్పానని తెలిపింది. ఈ అబద్దం చెప్పిన పాపానికి అతనికి ఆపరేషన్ చేసిన 40మంది వైద్యులని, మందులు అందించిన 30మంది నర్సులని క్లీనింగ్ స్టాఫ్ సిబ్బిందిని క్వారంటైన్ కి తరలించాల్సిన పరిస్థితి వచ్చింది. రాజస్థాన్ రాష్ట్రంలో కూడా ఓ కరోనా పాజిటివ్ వ్యక్తి కి కరోనా వైరస్ సోకిందని తెలియక ఒక ఆసుపత్రి  సిబ్బంది వైద్యం చేసింది. ఫలితంగా రాజస్థాన్ రాష్ట్రము తమ 2 లక్షల మంది ప్రజలకి సర్వే చేయాల్సిన పరిస్థితి వచ్చింది.



మరింత సమాచారం తెలుసుకోండి: