కరోనా మహమ్మారి ఇప్పటికీ వేల ప్రాణాలు తీస్తూ  ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది.  చిన్నా పెద్దా తారతమ్యం లేదు.. సామాన్యుడు సెలబ్రెటీ అనే బేధం లేదు ఈ కరోనా ఎవ్వరినీ వదలడం లేదు.  భారత దేశంలో ఇప్పటికీ 5 వేల కేసులు నమోదు అయ్యాయి.  ప్రపంచ వ్యాప్తంగా వేల మరణాలు.. లక్షల్లో కేసులు నమోదు అవుతున్నాయి.  భారత దేశంలో గత నెల 24 నుంచి లాక్ డౌన్  ప్రకటించిన విషయం తెలిసిందే.  కరోనా ని కట్టడి చేయాలంటే మనం ఎంతో జాగ్రత్తలు పాటించాలి.. సామాజిక దూరం ఉండాలి. 

 

చేతులు శుభ్రం చేసుకోవాలి.. శానిటైజర్లు వాడుతుండాలి.. కరోనా లక్షణాలు ఉన్నవారిని వెంటనే హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం చేయాలి.  ఇలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నా.. కరోనా వ్యాప్తిని మాత్రం అరికట్టే లేక పోతున్నాం. తాజాగా గుజరాత్‌లోని జామ్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో కొవిడ్‌-19 బారిన పడి 14 నెలల శిశువు మృతి చెందిందని అక్కడి వైద్యులు తెలిపారు. ఇటీవల ఆసుపత్రిలో చేరిన శిశువుకు ఏప్రిల్‌ 5న కరోనా పరీక్షలు నిర్వహించారు.

 

ఆ చిన్నారికి కరోనా పాజిటీవ్ అని తేలగానే వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో మంగళవారం సాయంత్రం శిశువు మృతి చెందింది.  ట్విస్ట్ ఏంటంటే ఆ శిశువు తల్లిదండ్రులకు కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా.. వారికి ఎలాంటి లక్షణాలు బయటపడలేదని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు.  

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: