కరోనా వైరస్ ఎక్కడ ఉంది, ఎంత ఉంది, ఎంతదాకా విస్తరించింది, ఇవన్నీ ప్రశ్నలే. ఇప్పటిదాకా సమాచారం సగమే వచ్చింది. మిగిలిన సగం ఊహాగానాలే. అందువల్లనే కరోనా భయం ఇంకా వీడలేదు అని గట్టిగానే చెప్పాలి. లాక్ డౌన్ అన్నది కరోనా వ్యాప్తిని నిరోధించేందుకేన్న్నది తెలిసిందే. దాని వల్ల ఫలితాలు బాగానే ఉంటున్నాయని అంటున్నారు.

 

లాక్ డౌన్ ముందు కరోనా ఒకవేళ సోకిన వారు ఉంటే వారంతా 14 రోజులో అంటే ఈ నెల 10 వ తేదీ మధ్యలో బయటపడుతారు అంటున్నారు. ఇక డిల్లీలో మర్కజ్ ప్రార్ధనలకు వెళ్ళిన వారు ఉన్నారు. వారి కేసులే ఇపుడు పెద్ద ఎత్తున బయటపడుతున్నాయి. ఇక వారి తరువాత ఎవరికైనా కరోనా సోకిందా, వారు వాహకాలుగా అంటించారా అన్నది కూడా ఇపుడు పెద్ద ప్రశ్న. అలాంటి వారు కనుక ఉంటే మరో వారంలో బయటకు కచ్చితంగా వస్తారని అంటున్నారు. అలాగే విదేశాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు అంటించిన వారు కూడా బయటపడేది ఈ చివరి వారంలోనేనంటున్నారు.

 


వైద్య నిపుణులు చెబుతున్నట్లుగా కరోనా వ్యాధిని ఎవరూ దాచలేరు. ఎందుకంటే అది ఏదోనాడు బయటపడేదే. ఆ విధంగా భావించే  ఏప్రిల్ 14 వరకూ లాక్ డౌన్ ప్రకటించారు. ఇక మిగిలింది వారం రోజులు. ఇప్పటివరకూ కరోనా పాజిటివ్ కేసులు వెల్లువలా వస్తున్నాయి అంటే ఇవన్నీ లాక్ డౌన్ ముందు కరోనా సోకిన వారివేనని భావించాలి.

 

ఇక మీదట అంటే వారి నుంచి తెలిసో తెలియకో అంటించుకున్న వారు ఉంటే వారు కూడా చివరి వారంలో బయటపడతారు. అంటే ఈ వారం చాలా కీలకమైనది. భారత జాతికి అతి ముఖ్యమైనది. రెండు వారాల తప్పస్సు  అంతా ఈ చివరి వారం మీదనే ఆధారపడి ఉంది. అంటే ఈ వారంలో ఎన్ని కరోనా  కేసులు వచ్చాయన్నది ఇపుడు చాలా ముఖ్యం. వాటిని బట్టే భారత దేశంలో కరోనా దశ ఏంటన్నది కూడా చూడాలి.

 

ఇక వారు కూడా బయటపడిన తరువాతనే భారత్ లో కరోనా ఎంత అన్నది పూర్తిగా తెలుస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. ఆ విధంగా కేసులు ఎక్కువగా పాజిటివ్ గా నమోదు అయితే మాత్రం మరి కొన్నాళ్ళు పాటు లాక్ డౌన్ పెట్టాల్సివుంటుంది. ఏది ఏమైనా భారత్ ప్రమాదకర దశలో ఉందా లేదా అన్నది తేల్చే కీలకమైన వారం ఇదే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: