దేశంలో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య  పెరుగుతున్న నేప‌థ్యంలో అత్యున్న‌త న్యాయ‌స్థానం స్పందించింది.  కరోనా వైర‌స్ వ్యాప్తికి  సుప్రీంకోర్టు ప‌లు కీలక సూచనలు చేసింది. కరోనా పరీక్షలకు ప్రైవేట్ ల్యాబ్‌లలో కూడా ఫీజు వసూలు చేయరాదని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ప్రస్తుతం ప్రభుత్వ ల్యాబ్‌లలో మాత్రమే కరోనా టెస్ట్‌లు ఉచితంగా నిర్వహిస్తున్నారు.  సుప్రీం సూచన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని ప్రైవేట్ ల్యాబ్‌లలో కూడా ఉచిత ప రీక్షలు నిర్వహించే విషయంపై కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశముంది.  కాగా దేశ వ్యాప్తంగా ప్రస్తుతం 5,194 మందికి కరోనా సోకింది. 149 మంది చనిపోయారు. 402 మంది కోలుకున్నారు. కరోనా పరీక్షలు పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ త రుణంలో సుప్రీంకోర్టు సూచనకు ప్రాధాన్యత ఏర్పడింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: