క‌రోనా వైర‌స్(కోవిడ్‌-19).. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌ను వ‌ణికిస్తున్న సంగ‌తి తెలిసిందే. గతేడాది డిసెంబరులో చైనాలోని వుహాన్ నగరంలో వెలుగుచూసిన కొత్తరకం కరోనా వైరస్.. ప్రస్తుతం ప్రపంచ మొత్తం వ్యాప్తిచెందింది. దీనికి వ్యాక్సిన్‌ లేకపోవడంతో నివారణ పైనే అన్ని దేశాలు దృష్టి సారించాయి. ఇక ఆంధ్రప్ర‌దేశ్‌లో సైతం రోజురోజుకు క‌రోనా కేసులు ఎక్కువ అవుతున్నాయి. ఇప్ప‌టికే ఏపీలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 329కు పెరిగింది. రాష్ట్రంలో కేసుల్లో కర్నూలు జిల్లా టాప్‌లో ఉంది. 

 

మొత్తం 13 జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు 11 జిల్లాల్లో నమోదుకాగా.. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అయితే క‌రోనా ఊపందుకోవ‌డంతో అసలీ వైరస్ ఏ వయసు వారికి ఎక్కువగా వస్తోంది అన్నది తేల్చాలని డిసైడైంది. ఆ క్రమంలో ఇప్పటివరకూ వచ్చిన అన్ని కేసుల లెక్కల్నీ విశ్లేషించి. దీని బ‌ట్టీ వారు ఓ ఆవ‌గాహ‌న‌కు వ‌చ్చారు. వీరి లెక్క‌ల‌ ప్రకారం చూస్తే... ఏపీలో యువకులకే ఎక్కువగా కరోనా వైరస్ సోకుతోంది. స్ప‌ష్టంగా ప‌రిశీలిస్తే.. ఏపీలో కరోనా సోకిన వారిలో 20 ఏళ్ల లోపు ఉన్నవారు 8 శాతంగా ఉన్నారు. 

 

అలాగే వయసు 21 నుంచి 40 మధ్య ఉన్నవారు 48 శాతంగా ఉన్నారు. అలాగే వయసు 41 నుంచి 60 మధ్య ఉన్నవారు 36 శాతంగా ఉన్నారు. అలాగే వయసు 60 కంటే ఎక్కువగా ఉన్నవారు 8 శాతంగా ఉన్నారు. మొత్తంగా చూస్తుకుంటే..  21 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపువారు ఏపీలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఎందుకంటే వాళ్లకే ఈ వైరస్ ఎక్కువగా సోకుతోంది కాబ‌ట్టి. అలా అని మిగిలిన వారు అజాగ్ర‌త్త‌గా ఉంటే మాత్రం తిప్ప‌లు త‌ప్ప‌వ‌ని అంటున్నారు. 

 

ఎందుకంటే.. క‌రోనా వ‌ల్ల పిల్లల్ని, ముసలివారిని వీలైనంతవరకూ ఇంటిపట్టునే ఉంటున్నారు. ఎటొచ్చీ యువకులు, మధ్య వయస్కులూ ఎక్కువగా బయటకు వెళ్లి కుటుంబం కోసం క‌ష్ట‌ప‌డుతున్నారు. దీంతో వాళ్ల‌కే క‌రోనా వ‌స్తుంద‌ని కూడా అంటున్నారు. ఏదేమైన‌ప్ప‌టికీ అంద‌రూ త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అంటున్నారు నిపుణులు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: