దేశంలో రోజురోజుకు మహామారి కరోనా వైరస్  పెరిగిపోతున్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ నియంత్రించేందుకు ఎన్ని చర్యలు  చేపట్టినప్పటికీ కరోనా  వైరస్ నియంత్రణ  మాత్రం ఎక్కడా జరగడం లేదు. రోజురోజుకు కరోనా  వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు . అయితే దేశంలో క్రమక్రమంగా కరోనా వైరస్  పెరిగిపోవడానికి ముఖ్య కారణం దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన నిజాముద్దీన్ మత ప్రార్థన సభ అన్న విషయం తెలిసిందే. ఈ సభకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల వారితో పాటు విదేశాల నుంచి కూడా చాలా మంది మత ప్రార్థన సభలో పాల్గొన్నారు. 

 

 

 ఇక ఈ సభకు వెళ్లిన అందరికీ దాదాపుగా కరోనా  వైరస్ సోకుతుంది. ప్రస్తుతం భారత్లో ఉన్న కరోనా  వైరస్ పేషెంట్ లలో  ఈ సభకు హాజరైన వారు ఎక్కువగా ఉండడం  గమనార్హం. అయితే కేవలం ఒక్క రాష్ట్రంలో మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల్లో  ఢిల్లీలో నిర్వహించిన మత ప్రార్థన సభకు వెళ్లిన వారు కరోనా  వైరస్ బారిన పడుతున్నారు. చాలామంది ఐసోలేషన్ లో  చికిత్స తీసుకుంటుండగా మిగతా వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు అధికారులు . అయితే ఢిల్లీలో జరిగిన మత ప్రార్థన సభకు హాజరైన వారందరూ స్వచ్ఛందంగా వచ్చి కరోనా వైరస్ నిర్దారిత  పరీక్షలు నిర్వహించుకోవాలని ప్రభుత్వాలు సూచిస్తున్నప్పటికీ చాలామంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 

 

 

 అయితే ఓ వైపు దేశ వ్యాప్తంగా ప్రజలందరూ కరోనా వైరస్ గురుంచి  బెంబేలెత్తుతుంటే  నిజాముద్దీన్ ఘటనపై రాజకీయ పార్టీలు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. ముఖ్యంగా బెంగాల్ లో అధికార తృణమూల్ కాంగ్రెస్ నేతలు... ప్రతిపక్ష బీజేపీ నాయకుల మధ్య సోషల్ మీడియా వేదికగా విమర్శల యుద్ధమే జరుగుతుంది అని చెప్పాలి. ఓటు బ్యాంకు కాపాడుకునేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ పబ్లిక్ జమాత్ సమావేశానికి వెళ్లిన వారి వివరాలు సేకరించేందుకు నిరాకరించారు అంటూ బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ  విమర్శలు చేస్తుండగా... నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ తృణముల్ కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: