ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా మ‌హ‌మ్మారిని అడ్డుకునేందుకు ఎవ‌రు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా క‌రోనా కేసులు మాత్రం ఆగ‌డం లేదు. ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా క‌మ్మేస్తుండ‌డంతో ఈ కేసుల సంఖ్య ఏకంగా 13 లోల‌కు చేరుకుంది. ఇక మ‌న‌దేశంలోనూ క‌రోనా కేసుల సంఖ్య ఏకంగా 5 వేలు దాటేసింది. మ‌హారాష్ట్ర‌లోనే ఏకంగా వెయ్యి క‌రోనా కేసులు ఉన్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ క‌రోనా కేసులు ఎలా విజృంభిస్తున్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. సినిమా ఇండ‌స్ట్రీ ప‌డుతోన్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు.

 

ఉపాధి లేక సినీ కార్మికులు ప‌డుతోన్న క‌ష్టాలు చూసి మెగాస్టార్ చిరు ఆధ్వ‌ర్యంలో సీసీపీ ఏర్పాటు చేసి ఇప్ప‌టి వ‌ర‌కు ఏకంగా రు. 7 కోట్ల విరాళాలు సేక‌రించారు. ఇక ప‌లువురు సినిమా హీరోలు, క్యారెక్ట‌ర్ న‌టులు త‌మ వంతుగా విరాళాలు ఇస్తున్నారు. ఇక నటుడు కాదంబరి కిరణ్ కుమార్ ‘మనం సైతం’ అనే సంస్థ కింద అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాదంబ‌రి కిరణ్ గ‌తంలోనూ ఎంతో మందికి త‌న వంతుగా సేవా కార్య‌క్ర‌మాలు చేశారు. తాజాగా కరోనావైరస్ కారణంగా లాక్ డౌన్ సమయంలో మనకోసం అహర్నిశలూ పనిచేస్తున్న పోలీసులకు తనవంతుగా సాయం చేశారు. ట్రాఫిక్ పోలీసులకు, పోలీసులకు ఫుడ్, మంచినీళ్ల బాటిల్స్ ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. కాదంబ‌రి కిర‌ణ్‌ను పోలీసుల‌తో పాటు ప్ర‌తి ఒక్క‌రు అభినందిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: