ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడొక ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కొంటున్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడంతో ఇక్కడ కరోనా అదుపులో ఉందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. మనం ఏం జరగదు అన్న అపోహలో ఎవరూ ఉండొద్దని... కరోనా కంటికి కనిపించకుండా దాని ప్రభావం చూపిస్తుందని.. దాని ప్రభావం చివర్లో బయట పడుతుందని.. అప్పుడు ఎవరూ ఏం చేయలేరని అన్నారు. అమెరికా, ఇటలీ వంటి దేశాలే కరోనాతో విలవిలలాడుతున్నాయని మంత్రి తెలిపారు. 6కోట్ల జనాభా ఉన్న ఇటలీనే కరోనాను అదుపుచేయ లేకపోతుంది. 130 కోట్ల జనాభా గల మన దేశంలో కరోనా అదుపు తప్పితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని చెప్పారు. 

 

 సిద్ధిపేట రూరల్ మండలం రాఘవాపూర్‌లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన నర్సరీని హరీష్ రావు పరిశీలించారు. అనంతరం గ్రామంలో ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.   కేవలం 6 కోట్ల జనాభా ఉన్న ఇటలీనే కరోనాను అదుపు చేయలేకపోతోందని, అలాంటిది 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో కరోనా అదుపు తప్పితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించాలని పేర్కొన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు కరోనాపై కొట్లాడుతూనే మరోవైపు రైతుల సంక్షేమానికి కృషి చేస్తోందని మంత్రి హరీష్ రావు చెప్పారు.  అగ్రరాజ్యాలైన అమెరికా, ఇటలీ వంటి దేశాలు కరోనాతో విలవిలలాడుతు న్నాయని అన్నారు.

 

అక్కడ మరణాలు చూస్తుంటే కడుపు తరుక్కు పోతుందని.. అంత టెక్నాలజీ ఉన్నా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొందని అన్నారు.  అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉందని, రైతులు తమ వెంట టార్పాలిన్ కవర్లు తెచ్చుకోవాలని సూచించారు. అదేవిధంగా రైతులు ఒకరికి ఒకరు సహకరించుకోవాలన్నారు.  లాక్‌డౌన్ ఇంకో వారం, పదిహేను రోజులు పెంచినా ప్రజలు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. కరోనాకు కులం, మతం, పేద, ధనిక బేదం లేదని, అందరికీ వస్తుందన్నారు. 

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: