లాక్ డౌన్ ఈ నెల 14వ తేదీతో ముగియనుంది. లాక్ డౌన్ అన్న నాడు ఇన్ని రోజులా అని అంతా తెగ బాధపడ్డారు. కానీ లాక్ డౌన్ కాలంలో ఎనభై శాతం గడచిపోయింది. భారంగానో, కఠినంగానో  దేశ  ప్రజలు  అంతా పాటించారు. మరి కొద్ది రోజుల్లో లాక్ డౌన్ ముగియబోతోంది. మరి ఈ ఇపుడు ఏం చేయాలి. ఓ వైపు చూస్తే కరోనా కేసులు పెరుగుతున్నాయి.

 

ఈ సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ పార్లమెంట్ లో వివిధ రాజకీయ పార్టీలతో మీటింగ్ నిర్వహించారు. ఈ రోజు జరిగినా ఈ సమావేశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లుగా సమాచారం. లాక్ డౌన్ కారణంగా లక్షలాది మందికి ఉపాధి పోయిందని కొన్ని పార్టీల నేతలు ఈ సమావేశంలో ప్రధానికి చెప్పినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో లాక్ డౌన్ వల్ల ఉన్న ఇబ్బందులు కూడా వివరించినట్లుగా భోగట్టా.

 

అయితే లాక్ డౌన్ని కొనసాగించాలని కూడా మరి కొన్ని పార్టీలు ప్రధానికి చెప్పినట్లుగా తెలుస్తోంది. అలాంటి పార్టీల్లో టీయారెస్ ముందు వరసలో ఉంది. అలాగే శివసేన వంటి పార్టీలు లాక్ డౌన్ని కొనసాగించాలని కోరినట్లుగా తెలుస్తోంది. ఇక లాక్ డౌన్ని దశల వారీగా ఎత్తివేయడం ద్వారానే అటు కరోనాను, ఇటు దేశాన్ని కూడా కాపాడుకోగలమని మెజారిటీ పార్టీలూ అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది.

 

మరి దీని మీద ప్రధాని మోడీ ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. ఈ నెల 11వ తేదీన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి లాక్ డౌన్ పైన ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అయితే కరోనా వీర విహారం చేస్తోంది.  కేసుల ఉధ్రుతి బాగా పెరుగుతోంది. ఈ సమయంలో లాక్ డౌన్ ఎత్తివేయడం వల్ల పరిస్థితి  మొదటికి రావడం కంటే కూడా ఇంకా ఘోరంగా తయారవుతుందని అంటున్నారు. మరి వీటిని ద్రుష్టిలో పెట్టుకుంటే కనుక లాక్ డౌన్ని మరి  కొంత కాలం కొనసాగిస్తారని అంటున్నారు. చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: