ప్రపంచాన్ని కమ్మేసిన కరోనాని ఎదుర్కోవడానికి అన్నిదేశాలు శక్తికి మించి పోరాడుతున్నాయి. కానీ కరోనా మాత్రం ఆ దేశాలకు చుక్కలు చూపిస్తూనే ఉంది. అత్యాధునిక వైద్య వసతులున్నా కూడా విదేశాలు కరోనా కోరల్లో చిక్కి విలవిలలాడుతున్నాయి. ఏం చేయాలో దిక్కుతోచక.. అన్ని దేశాలు ఆశగా మనదేశం వైపే చూస్తున్నాయి. చైనా తర్వాత రెండవ అధిక జనాభా కలిగిన దేశమైన మనకు.. మెరుగైన వైద్య వసతులు లేవు..   కరోనాపై మనం విదేశాల కంటే ఎక్కువగా విజయభేరి మోగిస్తున్నాం..ఇది ఎలా సాధ్యమవుతోంది.

 

ప్రపంచ దేశాలను కరోనా కుమ్మేస్తోంది. కంటికి కనిపించకుండా కమ్మేస్తోంది. ఏ దేశాన్నీ వదలడం లేదు..ఎక్కడ అడుగుబెట్టినా.. కరోనా హత్యలే పెరిగిపోతున్నాయి. ఈ హంతకుడిని అదుపులోకి తీసుకోలేక అన్ని దేశాలు అతలాకుతలం అవుతున్నాయి. 

 

ఆర్థికంగానూ, సామాజికంగానూ దెబ్బతింటున్నాయి. కరోనాకు సరైన మందు లేకపోవడంతో.. ఉన్న చిన్నా చితకా మందులు సరిపోకపోవడంతో కరోనా ప్రతి దేశంలో తైతక్కలాడుతోంది. దాని తిక్క వదిలించేందుకు..తొక్కి నారతీసేందుకు.. ట్రంపు కూడా చివరకు మన దేశంవైపే ఆశగా చూస్తున్నాడు..  ఎందుకంటే... ఏ దేశంలో లేని శక్తి మన దేశంలో ఏదో ఉందని పెద్దన్నకు బాగా అర్థమైంది.. ఇటలీ, జర్మనీ,,లండన్‌, అమెరికా.. ఏ దేశంలో చూసినా.. ప్రపంచ స్థాయి మెరుగైన అత్యాధునిక వైద్య వసతులున్నాయి. ఎలాంటి రోగమొచ్చినా.. యుద్ధం చేసే శక్తి సామర్థ్యాలున్నాయి. కానీ..  కరోనాను మాత్రం కంట్రోల్‌ చేయలేక.. ఆ మహమ్మారికి దాసోహమవుతున్నాయి. రోజూ వందల సంఖ్యలో కరోనా బలి కోరుతోంది.. చైనా తర్వాత అత్యంత అధిక జనాభా కలిగిన మన దేశంలో.. అత్యాధునిక వైద్య వసతుల్లేవు.. పెద్ద రోగమొస్తే.. మంచం పట్టాల్సిందే.. తేడా కొడితే కాటికెళ్లాల్సిందే.. పైగా విదేశాలు చాలా పరిశుభ్రంగా ఉంటాయి.  ఆదేశాల పౌరుల్లో శుభ్రత ఎక్కువ.. మన దేశంలో శుభ్రత గురించి తెలిసిందే.. వ్యాధుల విస్తరణకు.. మన దేశ పరిసరాలను మించిన అనుకూల ప్రాంతాలు మరెక్కడా ఉండవేమో..అయినా.. కరోనా మాత్రం మన దేశంలో కంట్రోల్‌గానే ఉంది..  ఎందుకు.. అసలు తమ దగ్గర లేనిదీ.. భారత్‌లో ఉన్నదీ ఏంటని.. అర్థం కాక..ట్రంపే జుట్టు పీక్కుంటున్నాడంట. చివరకు దిక్కు తోచక మోడీకి ఫోన్‌ చేసి.. అసలు విషయం తెలుసుకున్నాడంట. 

 

అమెరికాను కరోనా కాలరాస్తోంది.. రోజూ వందల సంఖ్యలో బలి తీసుకుంటోంది.  చివరకు ఫ్రాన్సుకు వెళ్లాల్సిన మాస్కులు కూడా అమెరికా హైజాక్‌ చేసిందంటే.. అక్కడి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. అందితే జుట్టు.. అందకపోతే కాళ్లు అన్నచందాన పెద్దన్న ట్రంపు అన్ని దేశాలకు ఫోన్ల వర్షం కురిపిస్తున్నాడు. చివరకు మన ప్రధాని మోడీకి కూడా ఫోన్‌ చేశాడు. మీ దేశంలో.. కరోనా అంత ఉధృతంగా లేకపోవడానికి కారణమేంటి..అసలు..మీరు యోగాతో కరోనాను కంట్రోల్‌ చేస్తున్నారట కదా.. ఆయుర్వేదంతో కరోనాను ఆపగలుగుతున్నారట కదా..అని చాలా సేపు వీటి గురించి మాట్లాడినట్టు సమాచారం. ఇవి ఎలా చేయాలి.. వీటి పద్ధతులేంటని..మోడీని అడిగి తెలుసుకున్నారు.. అదీ.. మన దేశ సత్తా.. కరోనాపై మన దేశ ఆయుధాలు.. 

 

భారతదేశం యోగా నిలయం.. ఆయుర్వేద భాండాగారం.. అనాదిగా ఇవి మన ఆచారాలు. సంప్రదాయాలలో మనకు తెలియకుండానే భాగమైపోయాయి. ఇప్పుడు మారిన, మారుతున్న కాలంలో వీటి గురించి చాలా మందికి తెలియకపోవచ్చు కానీ.. ఈ రెండింటి వల్ల... ఎన్నో సాధ్యమవుతాయని.. ఆనాడే మన పూర్వీకులు ఆచరణలో చేసి చూపారు. ఎన్నో అంటువ్యాధులను కూడా ఇవి నయం చేస్తాయని నిరూపించారు కూడా.. ఇప్పుడు మళ్లీ వాటి అవసరం మనకు ఏర్పడింది. అది కూడా.. యోగా అనే పదమే తెలియని ట్రంపే.. యోగా గురించి.. ఆయుర్వేదం గురించి ఫోన్‌ చేసి తెలుసుకునేంతలా... విదేశాలకు అంతుబట్టని.. మన ఆరోగ్య చిట్కాలు.. ఆయుర్వేద సూత్రాలు..యోగా మర్మాలు కరోనాపై యుద్ధభేరి మోగించాయి. అవే నేడు మనల్ని కొంతలో కొంత కాపాడుతున్నాయనే చెప్పవచ్చు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: