ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా కల్లోలంతో వణికి పోతుంది.  దేశంలో గత నెల 24 నుంచి పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ప్రకటించారు.  21 రోజుల పాటు లాక్ డౌన్ లో పాటించి ఇంటి పట్టున ఉంటే కరోనా వ్యాప్తిని సమూలంగా అరికట్ట వచ్చు అని ప్రధాని మోదీ పిలుపు ఇచ్చారు. కానీ కొంత మంది మాత్రం లాక్ డౌన్ ను పదే పదే ఉల్లంఘిస్తున్నారు. ప్రభుత్వం లాక్ డౌన్ విధించినా జనం మాత్రం పట్టించుకోవడం లేదు. గుంపులు గుంపులుగా రోడ్లపైకి వస్తున్నారు. 

 

కనీసం మాస్క్ కూడా ధరించకుండా రోడ్లపై విచ్చలవిడిగా తిరుగుతున్నారు.  పోలీసులకు మస్కా కొట్టి తిరుగుతున్నారు.   ప్రభుత్వం, పోలీసులు రోడ్లపైకి రావద్దని చెబుతున్నా జనాలు లాక్ డౌన్‌ను బేఖాతరు చేస్తున్నారు. 50 శాతం మంది వాహనదారులు ఎటువంటి కారణం లేకుండానే రోడ్డుమీదకు వస్తున్నారు. గత ఆదివారం నుంచి ఈ ఉల్లంఘన అధికం అవుతుందని అంటున్నారు. 

 

పోలీసులు తమ లాఠిలకు కూడా పని చెబుతున్నా వీరిలో మాత్రం మార్పు రావడం లేదు.  వారిని పోలీసులు అడ్డుకోవడంతో కుంటిసాకులు చెబుతున్నారు. దీంతో పోలీసులు అలాంటివారిపట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: