కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. ఈ వైరస్ కారణంగా ఎన్నో దేశాలు   విలవిలలాడుతున్నాయి.  కరోనా వైరస్ పుట్టిన   వుహాన్ ఊపిరి పీల్చుకుంటూ ఉంటే. వైరస్ సోకి ప్రపంచ దేశాలు విలవిలలాడుతున్నాయి. ఇదిలా ఉండగా అమెరికాలో ఆలస్యంగా మొదలై వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్ అమెరికా ప్రజలను పట్టిపీడిస్తోంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్ కట్టడికి   N-95  మరియు పరిశుభ్రత ముఖ్యమని చెబుతోంది.  ఎంతో అభివృద్ధి చెందినటువంటి అమెరికా దేశం ఈ వైరస్ కి అతీతం ఏమీ కాదు. ఇప్పుడు అమెరికాలో కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలను సహాయం  కోరుతూనే ఒకపక్క వార్నింగ్ లు మరోపక్క సముద్రపు దొంగ గా మారుతున్నాడు.

 

  వివరాలలోకి వెళితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ N-95  మరియు hydroxychloroquine కోసం చైనాలోని అమెరికన్  కంపెనీలకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇదే సమయంలో ప్రపంచంలో ఇతర దేశాల నుంచి కూడా సహాయం కోరడం జరిగింది. అదేవిధంగా జర్మనీ, ఫ్రాన్స్  మరియు   ఇటలీ లు తమ దేశాలకు కూడా N-95  లను మరియు covid-19  వెంటిలేషన్ సామాగ్రిని భారీ మొత్తంలో ఇతర దేశాల కు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. కోపించిన   ట్రంపు తమ దేశానికి కాకుండా వేరే దేశాలకు  పంపిస్తారా అని కోపంతో ఊగిపోతూ. ఫ్రాన్స్, జర్మనీ మరియు ఇటలీ లకు వెళ్లవలసిన PPE  గూడ్స్ లను ఆపి తమ దేశానికి తరలించాడు.

 

 

దీనితో అమెరికా మిత్ర దేశాలు ట్రంప్ పై మండిపడుతున్నాయి. మిత్ర దేశాలు మాత్రం ఒక అమెరికా కే కాదు మా దేశానికి కూడా శానిటరీ మరియు ఇతర సామాగ్రి ఎంతో అవసరమని వాపోయాయి. మరోపక్క hydroxychloroquine మాకు ఇవ్వకపోతే ప్రతీకార చర్యలు తప్పవని డోనాల్డ్ ట్రంప్ ఇండియా ని బెదిరిస్తూ అదేవిధంగా తమ దేశానికి సహాయం  చేయని దేశాలకు ఇతర   దేశాలను సహాయం చేయొద్దని  ఆదేశిస్తున్నాడు.  మొత్తానికి డోనాల్డ్ ట్రంప్ ఒక సముద్రపు దొంగ గా ప్రపంచ దేశాలు అభి వర్ణిస్తున్నాయి. అదేవిధంగా ట్రంప్ కి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: