కరోనా వైర‌స్ పై ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో కుప్ప‌లు తెప్ప‌లుగా ఫేక్ వార్త‌లు ప్ర‌చారం అవుతున్నాయి.  వాట్సాప్‌తోపాటు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న అస‌త్య వార్తలపై హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వైరల్‌ వార్తలు, మార్ఫింగ్‌ ఫొటోలు, వీడియోలను సహించబోమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే వైరల్‌ చేసిన పలువురిని గుర్తించి అరెస్టు చేశామని తెలిపారు. అదేవిధంగా కరోనాపై అసత్య వార్తలను, సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు. కరోనాపై అసత్య వార్తలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్న వారిని గుర్తించడానికి సైబరాబాద్‌లో ప్రత్యేకంగా రెండు సైబర్‌  క్రైమ్‌ బృందాలను ఏ ర్పాట్లు చేసినట్లు సీపీ తెలిపారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వైరల్‌ వార్తలు సృష్టించిన వారిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ తెలిపారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: