యోగా అంటేనే బద్ధకించే వాళ్లు కూడా కరోనా దెబ్బకు  యోగా గురువులైపోయేలా ఉన్నారు. మందులేని ఈ మహమ్మారిని తరిమి కొట్టాలంటే.. మన పూర్వాచారాలే. యోగాసనాలే గట్టెక్కిస్తాయని గట్టిగా నమ్ముతున్నారు. వీటి వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని.. మన  ఆయుర్వేదం చెబుతోంది.. వాటినే ఇప్పుడు పాటించాలని.. తలపండిన డాక్టర్లే చెబుతున్నారు.   

 

మన దేశ ప్రాచీన  యోగాను.. మొట్టమొదట విదేశాలకు పరిచయం చేసిన తొలి వ్యక్తి  స్వామి వివేకానంద. అమెరికాలోని చికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో రాజయోగ గురించి అద్భుతంగా మాట్లాడి.. విదేశీయులను ఆలోచింపజేశాడు.  అప్పటి నుంచే ప్రపంచంలో మన దేశ యోగా గురించి చర్చ మొదలైంది. అప్పట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోకపోయినా.. కరోనా దెబ్బకు మళ్లీ.. మన స్వాములు చెప్పిన యోగా పుస్తకాల బూజు దులుపుతున్నారు. ఆయుర్వేదం పుస్తకాల కోసం వెతుకుతున్నారు. 

 

ఉచ్ఛ్వాస నిశ్వాసాలే మనిషికి ప్రాణాధారం. అలాంటి శ్వాసకు ఏమాత్రం ఆటంకం కలిగినా మనిషి నిస్తేజితుడవుతాడు. ప్రాణాయామంతో వాటిని జయించి.. అందులో మర్మాలను తెలుసుకోవాలని ఎందరో యోగా గురువులు చెప్పారు. దీని వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని.. ఎన్నో అంటువ్యాధులను ఎదుర్కొనవచ్చని సూచిస్తున్నాయి. కరోనాని ఆదిలోనే అడ్డుకోవాలంటే.. ప్రాణాయామం చేసి.. యోగా నియమాలు పాటించాలని యోగా పెద్దలు చెబుతున్నారు. 

 

మరోవైపు.. కరోనా వ్యాప్తిని నివారించడానికి తమని తాము రక్షించుకోవాలని.. యోగా గురు రాందేవ్‌ చెబుతున్నారు. కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు. కరోనా వ్యాపించకుండా.. జాగ్రత్తలు తీసుకుంటూనే.. మీలో రోగ నిరోధక శక్తినిపెంచుకునేందుకు రోజూ యోగా సాధన చేయండని సలహా ఇస్తున్నారు.  

 

మరోవైపు యోగాతోనే కరోనాను జయించామని చెబుతున్నారు పుణె వాసులు..మొదట్లో తమకు  కరోనా పాజిటివ్‌ వచ్చినప్పుడు చాలా భయపడినా.. ఐసొలేషన్‌లో  ఉన్నప్పుడు..పుస్తకాలు చదవడం.. ఎక్కువ సేపు యోగా చేయడం.. చక్కని సంగీతం వినడం.. మనసును ఉల్లాసంగా ఉంచుకోవడం వల్ల..  కరోనా నుంచి తమ ఫ్యామిలీ మొత్తం కోలుకున్నామని చెప్పారు.  

 

వ్యాధికారక క్రిములు శరీరంలో ప్రవేశించినప్పుడు రోగనిరోధక వ్యవస్థ స్పందించి.. వాటిని తట్టుకునేందుకు అనుగుణంగా శరీరాన్ని సిద్ధం చేస్తుంది. మనిషి ఆరోగ్యంలో ఈ వ్యవస్థది కీలక పాత్ర. పోషకాహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. నిత్యం యోగా చేయడం కూడా అంతే ముఖ్యమని.. బెంగళూరులోని యోగ  యూనివర్సిటీ చెబుతోంది. ఇక ప్రాణాయామం చేస్తే.. ఉచ్ఛ్వాస నిశ్వాసాలపై నేరుగా దాడిచేసే కరోనాను..మొదట్లోనే కంట్రోల్‌ చేయచ్చంటున్నారు.

 

మరోవైపు హైదరాబాద్‌లోని రామకృష్ణా మఠం కూడా కరోనాను జయించడం యోగాతోనే సాధ్యమంటోంది. నిత్యం చేసే యోగాసనాల ద్వారా  కరోనాను నియంత్రించవచ్చని చెబుతోంది.. ఇందుకు అవసరమైన ప్రత్యేక యోగాసనాలకు సంబంధించి తరగతులు నిర్వహిస్తోంది. ఇప్పుడు చాలా మంది.. యోగా కోసం రామకృష్ణ మఠానికి క్యూ కడుతున్నారు. 

 

ఆరోగ్యం పెంచుకుంటే జబ్బులకు ఎదురొడ్డి పోరాడటగలం. అసలే కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇటువంటి మహమ్మారి శరీరంపై అటాక్ చేసినప్పుడు అంతర్గతంగా తట్టుకోగల శక్తి లేకపోతే మనల్ని ఏ మందులు కాపాడలేవు. మానవ శరీర నిర్మాణంలోని అత్యంత కీలకమైనవి ఊపిరితిత్తులు. పెరుగుతున్న కాలుష్యాన్ని బట్టి వాహనాల పొగ, సిగరెట్ పొగ, డైట్ లో సమస్యలు ఊపిరితిత్తులను ఏ స్థితిలో ఉంచాయో మనం అంచనా వేయలేం. ఇలాంటప్పుడు.. కొవిడ్ 19 లాంటి మహమ్మారి అటాక్ చేస్తే మనం కోలుకోగలమా. అలాంటి వాటి నుంచి శరీరాన్ని సిద్ధం చేసుకోవడానికి మనం ముందుగానే అలర్ట్ అవ్వాలి. యోగా లాంటి పురాతనమైన అత్యంత ప్రభావంతమైన టెక్నిక్ వాడాలి. 

 

యోగా దివస్‌ పేరుతో యోగా కోసం ఒక రోజునే కేటాయించిన ప్రధాని మోడీ.. నిత్యం యోగా చేస్తారు. అందుకే ఈ వయసులో ఆయన  ఎంత  ఆరోగ్యంగా  ఉంటారో తెలిసిందే ..అందుకే. ఇవాళే.. ఈక్షణమే యోగా భేరి మోగించండి..కరోనాపై యుద్ధం ప్రకటించండి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: