ప్రపంచాన్ని గడగడ లాడించాలని, తనదే పైచేయి ఉండాలని అనుకునే అగ్ర రాజ్యం ఇప్పుడు అతలాకుతలం అవుతోంది. తమని కాపాడే నాధుడి కోసం వెయ్యి కళ్ళతో వేచి చూస్తోంది. కానీ ప్రస్తుతం  ట్రంప్ తింగరి చేష్టలకి, నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకుంటోంది అమెరికా. ఇదిలాఉంటే అమెరికా మొత్తం ఇప్పుడు కరోనా వైరస్ తో కొట్టి మిట్టాడుతుంటే..ట్రంప్ కి  మాత్రం కొత్తరకం వ్యాధి సోకిందనే వార్తలు ఇప్పుడు గుప్పుమంటున్నాయి..

IHG

అదేంటి కరోనాకంటే పెద్ద జబ్బా  అనుకుంటున్నారా అవును నిజమే..కరోనా విపత్కర సమయంలో ట్రంప్ తన హుందా తనాన్ని కోల్పోతున్నారు. అగ్ర రాజ్యానికి అధ్యక్షుడిగా ఉన్నాను అనే విషయాన్ని మర్చిపోయిన ట్రంప్ వివిధ దేశాలపై నోరు పారేసుకుంటున్నారు. మొన్నటి వరకూ చైనాని కరోనా చైనా గా దూహించిన ట్రంప్ ఇప్పుడు తమ అవసరాల కోసం చైనాతో జట్టు కట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. అంతేకాదు భారత్ తమకి ఎంతో మిత్ర దేశం అంటూ మోడీ ని పొగడ్తలతో ముంచెత్తిన ట్రంప్ మేము అడిగిన మందు పంపక పొతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరికలు కూడా జారీ చేశారు...

IHG't Get Enough of World Leaders Laughing at <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=DONALD TRUMP' target='_blank' title='trump-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>trump</a> ...

అక్కడితో ఆగని ట్రంప్ ప్రపంచ ఆరోగ్య సంస్థ పై కూడా నోరు పారేసుకున్నారు. తాజాగా ఈరోజు మోడీ ఎగుమతుల పై నిషేధం తాత్కాలికంగా తొలగించడంతో మళ్ళీ మోడీ మంచి వ్యక్తి అయ్యాడు. ఇలా రోజుకో మాట పూటకో వేషం వేస్తున్న ట్రంప్ కి కొత్తం జబ్బు వచ్చి పడిందని, అందుకే మెమరీ లాస్ అయిన వ్యక్తిలా ప్రవర్తిస్తున్నారని మండిపడుతున్నారు అమెరికన్స్. కరోనా అమెరికాకి వ్యాప్తి చెంది వేలాదిమంది మరణించిన నాటి నుంచీ ట్రంప్ వైఖరిలో ఎంతో మార్పు వచ్చిందని , ట్రంప్ తింగరి స్వభావం దూకుడు తనం ప్రపంచ దేశాల ముందు అమెరికాకి చెడ్డపేరు తెచ్చేలా ఉందని మండిపడుతున్నారు అమెరికా ప్రజలు. మొత్తానికి ఎదో కొత్త జబ్బుతో ట్రంప్ ఇబ్బంది పడుతున్నారని కానీ ఈ జబ్బు కరోనా అమెరికాకి చేస్తున్న నష్టం కంటే అధికంగా నష్టాన్ని  ఇస్తుందని అంటున్నారు విమర్శకులు..

మరింత సమాచారం తెలుసుకోండి: