భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ప్రపంచ దేశాల అధినేతల నుండి ప్రశంసల జల్లు కురుస్తోంది. క్లిష్ట సమయంలో ప్రపంచమంతా ఒకటై నడవాల్సిన నేపథ్యంలో మోడీ ఇతర దేశాలకు సహాయకంగా మందులని సరఫరా చేయనున్న సంగతి తెలిసిందే. దీంతో బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సోనారో భారత ప్రధాని మోదీని హనుమంతుడి తో పోల్చిన విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రపంచమంతా కరోనా దెబ్బకి అల్లాడిపోతున్న సమయంలో హైడ్రాక్సి క్లోరోక్విన్ మందు ని ప్రపంచానికి అందిస్తున్న మోదీ మహనీయుడు అని ఆయన కొనియాడారు.

 

పురాణాల్లో లక్ష్మణుడి ప్రాణాలను సంజీవని ద్వారా హనుమంతుడు ఏరకంగా అయితే కాపాడాడో అలాగే ఈరోజు మానవాళిని మోడీ హైడ్రాక్సీ క్లోరోక్విన్ ద్వారా కాపాడుతున్నారని ప్రశంసించాడు. అమెరికాతో సహా అవసరం ఉన్న అన్ని దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధమని మోదీ ప్రకటించగానే ప్రపంచ దేశాల అధినేతలు అతనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మలేరియాకు మందుగా పనిచేసే ఔషదం కరోనాకు కూడా చక్కగా పని చేస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో సహా పలువురు విశ్వాసం గా ఉండడంతో దీనికి డిమాండ్ భారీగా పెరిగింది.

 

అయితే మందును అత్యధిక మొత్తంలో ఉత్పత్తి చేసే దేశం భారత్ కావడంతో ప్రపంచదేశాలన్నీ భారత్ పైనే ఆశలు పెట్టుకోగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ అవసరమైనంత మేర నిల్వ ఉంచుకొని మిగతా స్టాక్ దాని అవసరం ఉన్న దేశాలకు సరఫరా చేయాలని మోదీ నిర్ణయించారు. మేరకు ఎగుమతులపై ఉన్న ఆంక్షలు తొలగించి హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ అందరికీ అందించేందుకు మోదీ మార్గం సుగమం చేశారు. నేపథ్యంలో వివిధ దేశాల నేతలు భారత్‌ను, భారత నాయకత్వాన్ని వేనోళ్ల పొగుడుతున్నారు. హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ ఎగుమతులపై ఆంక్షలు విధించారని తెలిసి తొలుత కన్నెర్ర చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా మోదీని ఆకాశానికెత్తేశారు. మోదీ మహానాయకుడని, మంచి వ్యక్తి అని ప్రశంసించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: