ప్రస్తుతం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకి బాగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే రోజుకి రెండంకెల సంఖ్యగా కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యే తరుణం మనం గమనిస్తూనే ఉన్నాం. ఇందులో పాజిటివ్ సంఖ్య ఎక్కువ శాతం మాత్రం ఢిల్లీ వెళ్లిన వారికీ రావడం ఇక్కడ విశేషం. ఇవి ఇలా ఉండగా వీరికి తోడుగా వారి ఇంటి సభ్యులకి, అలాగే ఏదైనా కలిసిన వారందరిని హాస్పిటల్స్ కి తరలించారు. వారిని పరిశీలించి టెస్టులు చేసి వారి బాగోగులను ప్రభుత్వం ఎప్పటికి అప్పుడు చూసుకుంటుంది. ఇవి ఇలా ఉంటే కొంతమంది మాత్రం ప్రభుత్వం ఎంత చెప్పిన వినని మూర్ఖులు బయట విచ్చలవిడిగా తిరుగుతున్నారు. 

 

 

అయితే ఈ తరుణంలో తన ఊరి ప్రజలు బాగుండాలని ఒక మహిళా సర్పంచ్ చేసిన అవగాహనకు ముఖ్యమంత్రి కేసీఆర్ మెచ్చుకోవడం జరిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే... మహబూబ్ నగర్  జిల్లాకు సంబంధించిన ఒక మహిళా సర్పంచ్ పారిశుద్ధ కార్మికులకు స్ఫూర్తిగా నిలుస్తూ స్వయంగా తానే ఫెయిర్ భుజానికి తగిలించుకొని గ్రామంలో సూక్ష్మజీవులను రసాయనాలు చల్లి తన వంతు సేవా కార్యక్రమం చేసారు. 

 

 


ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ జిల్లాలోని నర్సింహులపేట మండలం సర్పంచ్ లక్ష్మిని మంత్రి కేటీఆర్ ఆమెను అభినందించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా చేసుకొని సర్పంచ్ పై ప్రశంసల వర్షం కురిపించడం జరిగింది. ఇందులో కరోనా మహమ్మారిని అరికట్టేందుకు పారిశుద్ధ్య కార్మికులను ఆమె నడిపిస్తున్నారని మంత్రి కేటీఆర్ తెలియజేశారు. ఈ యువ సర్పంచ్  చూసి అయినా ఈ కార్యక్రమం అందరికీ ఆదర్శం అవ్వాలని కేటీఆర్ ట్వీట్ ముఖంగా తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: