ఏపీలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ  రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఇప్పటికే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించామని తెలిపిన ఆయన ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ధాన్యంపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఏ రైతు ఇబ్బంది పడటానికి వీల్లేదని.. మామిడి, ఇతర పండ్ల ధరలు పడిపోకుండా చూడాలి అధికారులకు కన్నబాబు దిశానిర్దేశం చేశారు.  అగ్రికల్చర్, అక్వా, ఫౌల్ట్రీ రంగాలపై ప్రతి రోజూ సీఎం సమీక్ష చేస్తున్నారు. జో్న్న, మొక్కజొన్నకు మద్దతు ధరలు ఇవ్వాలని కోరాం 

 

ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకే రొయ్యలు కొనుగోలు చేయాలి. కరోనా ప్రభావం చికెన్ పై భారీగా పడిందని అన్నారు. కరోనా వచ్చిన తర్వాత ఆ వైరస్ చికెన్ లో ఉందని దుష్ప్రచారం చేశారని అన్నారు. ఫౌల్ట్రీ పరిశ్రమను మానిటర్ చేసేందుకు ఓ కమిటీ ఏర్పాటు చేశాం అన్నారు. రైతు, వినియోదారుడు నష్టపోకూడదని ప్రభుత్వం ఉద్దేశం. ఎవరికి ఏ సమస్య ఉన్నా ప్రభుత్వానికి వెంటనే తెలియజేయండని అన్నారు. 

 

 

ప్రస్తుతం కరోనా పరిస్థితుల వల్ల అన్ని వ్యవస్థలు అస్తవ్యస్థంగా ఉన్నాయని.. అన్ని చక్కబడే వరకు అందరూ సమన్వయం వహించాలని అన్నారు.  రాష్ట్రంలో లాక్ డౌన్ ప్రతి ఒక్కరూ సీరియస్ గా పాటించాలని.. కరోన నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: