ప్ర‌పంచ మ‌హ‌మ్మారిగా మారిన కరోనా వైరస్ గురించి పాల‌కులు, స్వ‌చ్ఛంద సంస్థ‌లు, మీడియా త‌మ‌దైన శైలిలో అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న సంగ‌తి తెలిసిందే.  ఈ ఒర‌వ‌డికి ప‌లువురు ఔత్సాహికులు సైతం జోడ‌వుతున్నారు. పోలీసులు క‌రోనా వైర‌స్ ఆకారంలో ఉన్న హెల్మెట్లు పెట్టుకుని ప్ర‌జ‌లు లాక్ డౌన్ పాటించాలంటూ అవేర్ నెస్ చేశారు. క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు హైద‌రాబాద్ లో ర‌క‌ర‌కాల కార్య‌క్ర‌మాలు చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఇప్పుడు క‌రోనా కారు సిటీలో చ‌క్క‌ర్తు కొడుతోంది. కారులో నుంచి మైకులో డ్రైవ‌ర్ మాట్లాడుతూ క‌రోనా జాగ్ర‌త్త‌ల‌ను తెలుపుతున్నాడు. క‌రోనా వైర‌స్ ఆకారంలో ఉన్న కారును హైద‌రాబాద్‌కు చెందిన ఓ ఔత్సాహిక వ్య‌క్తి రూపొందించారు. 

 

హైదరాబాద్ బ‌హుదూర్‌పురాకు చెందిన వాకీ కార్ల రూపకర్త సుధాకర్  త‌న `సుధా కార్స్` మ్యూజియం ద్వారా ఈ కారును త‌యారు చేశారు. కరోనా వైరస్ ఆకృతిలో కారును తయారు చేసి రోడ్లపై తిప్పుతూ క‌రోనా వైర‌స్ గురించి ఈ కారు ద్వారా ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. సోష‌ల్ డిస్టెన్స్ పాటించాల‌ని.. క‌రోనా జాగ్ర‌త్త‌లు.. వైర‌స్ సోక‌కుండా ఎలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టాలి అనేది ఈ కారు ద్వారా ప్ర‌చారం చేస్తున్నారు. 100 సీసీ ఇంజిన్ తో, కారులో ఒక‌రు కూర్చునేలా కారును త‌యారు చేశారు. గంట‌కు ఈ కారు 40కేఎంపీహెచ్ స్పీడ్ తో ప్ర‌యాణిస్తున్న‌ట్లు తెలిపారు. గతంలోనూ ఆయన వినూత్నమైన కార్లను రూపొందించి అవగాహనా కార్యక్రమాలు చేపట్టారు . 

 

ఇదిలాఉండ‌గా, క‌రోనా కేసుల ఉధృతి కొన‌సాగుతున్న‌ మ‌హారాష్ట్ర‌లో ఇవాళ కొత్త‌గా 117 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా..8 మంది మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసులు 1135 న‌మోద‌వ‌గా..మృతుల సంఖ్య 72 కు చేరుకుంద‌ని ర‌ని ఆ రాష్ట్ర వైద్య‌రోగ్య శాఖ వెల్ల‌డించింది. మ‌హారాష్ట్ర‌లో కేసుల సంఖ్య పెరుగుతుండ‌టంతో..కొత్త‌గా శిక్ష‌ణ పూర్తి చేసుకున్న న‌ర్సులు,వార్డు బాయ్స్ వైద్య సేవ‌లందించేందుకు భ‌య‌ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఆర్మీలో వైద్య‌సేవ‌లందించిన అనుభ‌వమున్న రిటైర్డ్ అధికారులు..క‌రోనా బాధితుల‌కు సేవ‌లందించేందుకు ముందుకురావాల‌ని సీఎం ఉద్ధ‌వ్ ఠాక్రే కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: