ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం అత్యవసర సేవలు మినహా మిగతా అన్ని మూసివేయబడ్డాయి. జన సమూహాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలు... రవాణా వ్యవస్థ... మద్యం దుకాణాలు... ఇలా అన్ని మూసివేయబడ్డాయి. గత కొన్ని రోజుల నుండి ఇలా లాక్ డౌన్  కొనసాగుతున్న తరుణంలో దేశంలో మద్యం దుకాణాలను తెరుచుకోవడం లేదు. దీంతో మందుబాబుల పరిస్థితి రోజు రోజుకు మరింత అధ్వానంగా మారిపోతుంది. రోజు మద్యం తాగే అలవాటు ఉన్నవారు మందు  దొరక్కపోవడంతో పిచ్చివాళ్ళలా  ప్రవర్తిస్తున్నారు. ఆ తర్వాత వారు ఏం చేస్తున్నారో వారికే తెలియనట్లుగా  ప్రవర్తిస్తున్నారు . 

 

 

 ఇక దేశంలో లాక్ డౌన్  సీని  నటి కుమారుడు నిద్రమాత్రలు మింగాడు . వెంటనే స్పందించిన కుటుంబ సభ్యులు సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లడం తో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే... తమిళ తెలుగు సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఇలాంటి మనోరమ. అయితే మనోరమ కుమారుడు నిద్రమాత్రలు మింగి నట్లు తెలిసింది. మద్యానికి బానిసగా మారిన సదరు సీనియర్ నటి కుమారుడు.. గత కొన్ని రోజుల నుండి దేశంలో లాక్ డౌన్  కొనసాగుతున్న సమయంలో మద్యం షాపులు తెరుచు  కోకపోవడంతో... మద్యానికి బదులుగా మత్తు రావాలనే ఉద్దేశ్యంతో నిద్రమాత్రలు మింగాడు.  

 

 

 

 అయితే మద్యానికి అలవాటు పడ్డ చాలామంది ఇలా మత్తు కోసం ఏవేవో చేస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. కొంతమంది మాత్రం  ఏకంగా ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడుతున్నారని  చెబుతున్నారు. ఇక కొన్ని చోట్ల మాత్రం మద్యం  దొరకకపోవడంతో ప్రాణం పోతున్న  సంఘటనలు కూడా జరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఇంకొన్ని చోట్ల మద్యం దొరక్కపోవడంతో మెడికల్ షాపుల్లో దొరికిన కొన్ని మందులను ఎక్కువ మోతాదులో తీసుకొని అనారోగ్యం పాలవుతున్నారు. అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం మద్యానికి బానిసైన వారికోసం ఓ వినూత్మ ప్రతిపాదన తీసుకు వచ్చింది. మద్యంకి  బానిసైన వారు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే మద్యం విక్రయించే అంశాన్ని తీసుకురాగా  దీని కోర్టు కొట్టిపారేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: