ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయటంలో ఎక్కువగా చాలా గట్టిగా పని చేస్తున్న సంజీవని వంటి మందు ఏదైనా ఉంది అంటే అది హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఒక్కటే. ఈ మందు కరోనా వైరస్ ని అరికట్టడంలో గేమ్ చేంజర్ అని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలో ఎక్కువ పాజిటివ్ కేసులతో పాటు మరణాలు కూడా భారీ స్థాయిలో సంభవిస్తున్న తరుణంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందు ని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే ఇండియా ని ఆశ్రయించడం జరిగింది. ప్రధాని మోడీ తో ఫోన్ లో మాట్లాడిన డోనాల్డ్ ట్రంప్ హైడ్రాక్సీ క్లోరోక్విన్ మెడిసిన్ అమెరికా కి పంపించాలి కరోనా వైరస్ విషయంలో అమెరికాకి గెలుపు చేయాలని సూచించారు. 

 

అయితే మోడీ మానవతా దృక్పథంతో అమెరికాకి ఈ మందు ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఈ నేపథ్యంలో ప్రపంచ దేశాలు అన్ని ప్రస్తుతం కరోనా వైరస్ కట్టడి చేయడం లో హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతి చేసే ఇండియా వైపు చూస్తున్నాయి. ఇండియాలో ఈ మందు మలేరియా వ్యాధి కోసం వాడతారు. చాలా దేశాలలో ఈ వ్యాధి ప్రమాదకర స్థాయిలో వ్యాప్తి చెందుతున్న తరుణంలో మొదటి దశలోనే వైద్యులు కరోనా వైరస్ పేషెంట్లకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్ ఇచ్చి చాలా వరకు నయం చేస్తున్నారు.

 

ఈ నేపథ్యంలో హనుమాన్ సంజీవిని కంటే గొప్ప ముందుగా అభివర్ణిస్తూ బ్రెజిల్ ప్రభుత్వం మోడీ ప్రభుత్వానికి హైడ్రాక్సీ క్లోరోక్విన్ డ్రగ్ తమ దేశానికి పంపించాలని కోరింది. ఈ సందర్భంగా మోడీ ప్రభుత్వానికి రామాయణాన్ని రిఫరెన్స్ గా వాడింది. లంకలో మూర్ఛపోయిన లక్ష్మణుడి కోసం హనుమంతుడు సంజీవనిని తెచ్చినట్లు, ప్రపంచం ఎదుర్కొంటున్న కరోనాను తరిమేసేందుకు భారత్ హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ను ఇవ్వాలని బ్రెజిల్ కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: