ఇండియాలో కరోనా రోజు రోజుకి విజృంభిస్తుంది. ఈ ఒక్క రోజే దేశ వ్యాప్తంగా 500కు పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం తో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 6000 దాటింది. ఇందులో 150 మంది పైగా మరణించగా 411 మంది కోలుకున్నారు. అయితే ప్రముఖ క్రికెటర్ ,టీమిండియా మాజీ సారథి ధోని సొంత రాష్ట్రం జార్ఖంఢ్ లో మాత్రం ఇప్పటివరకు కేవలం 4 కరోనా కేసులు మాత్రమే నమోదు కావడం హర్షించదగ్గ విషయం. గడిచిన 24 గంటల్లో అక్కడ ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. అయితే కరోనా తీవత్ర లేనప్పటికీ లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నామని  జార్ఖండ్ ముఖ్యమంత్రి  హేమంత్ సొరేన్ అన్నారు. 
 
ఇక సౌత్ విషయానికి వస్తే ప్రస్తుతం తెలంగాణ ,ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడులో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూపోతుంది. తమిళనాడులో ఈ  ఒక్క రోజే 48 పాజిటివ్ కేసులు నమోదు కావడం తో కేసుల సంఖ్య 700 దాటింది. అలాగే తెలంగాణ లో ఈరోజు 49 కేసులు నమోదు కావడం తో కరోనా బాధితుల సంఖ్య 453కు చేరింది. అటు ఆంధ్రా లో నేడు 19 కేసులు నమోదు కావడం తో కేసుల సంఖ్య 348 కు చేరింది.
 
ఓవరాల్ గా చూసుకుంటే మహారాష్ట్ర లో కరోనా ప్రభావం అధికంగా వుంది. మొత్తం ఇప్పటివరకు అక్కడ 1000 కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఈనెల 14తో దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ ముగియనుంది. అయితే కేసుల సంఖ్య పెరుగుతుండడంతో లాక్ డౌన్ ను మరి కొన్ని రోజులు పొడిగించాలని కేంద్రం భావిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: