కరోనా గురించి ప్రతి మనిషి ఒక గుణపాఠాన్ని నేర్చుకోవాలి.. ఒక నీతిని గ్రహించాలి.. అదేమంటే.. ఈ జీవితంలో ఎవరికి ఎవరు శాశ్వతం కాదు.. ఎన్ని కోట్ల ధనం ఉన్న ముంచుకొచ్చే ముప్పును ఎవరు ఆపలేరు.. పుట్టడం ఎలాగో, చావడం కూడా అలాగే.. ఇంత దానికి దొంగతనాలు, దోపిడీలు, కుళ్లు రాజకీయాలు, కుతంత్రాలు.. వీటివల్ల సాధించేది ఏం ఉండదు.. నీకంటూ ఉండేది పిడికెడు మట్టి.. లేదా చెంబెడు బూడిద.. ఇక నీతి ఏమంటే.. మన పూర్వకాలంలో ఇంట్లోకి వచ్చే ముందు కాళ్లూ, చేతులు కడుక్కోని, నోరూ పుక్కిలిచ్చి రావాలని, ఇంటి ముందు పేడ చల్లుకుని చక్కగా ముగ్గు వేసుకోవాలని ఇవేగాక ఇలాంటివి చాలా చెప్పారు.. అవన్ని పాతకాలపు ముచ్చట్లని తేలికగా తీసేసాము.. ఫలితంగా పక్షుల్లా ఇళ్లు అనే పంజరంలో ఇరుక్కుపోయాము..

 

 

ఇదిలా ఉండగా ప్రపంచంలో ఆధిపత్యపోరు ఈనాటిది కాదు.. ఈ ఆలోచన ఒక్క మనిషికే సొంతం కాదు.. ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి జరిపే చర్య ఇది.. కానీ ఒక్క మనిషికి తప్ప ఏ జీవికి తప్పోప్పులు గ్రహించే జ్ఞానం  లేదు.. అందుకే అవి అలా పోరాడుతాయి.. కానీ అన్ని తెలిసిన మనిషి కూడా జంతువుల కంటే దారుణంగా మారుతున్నాడు.. దీని ఫలితం లోకనాశనం.. మానవజాతికే ప్రమాదం.. ఒక్క కరోనా వస్తేనే ఇంత అతలాకుతలం అవుతున్నాడే మానవుడనే మేధావి.. ఈ కరోనాతో పాటుగా, మిగతా వ్యాధులు దాడిచేసి, ప్రకృతి విపత్తులు కలిగిస్తే ఇంకేం తట్టుకుంటాడు.. ఆలవుట్ పెడితే దోమలు రాలినట్లుగా రాలిపోతాడు..

 

 

ఇదిలా ఉండగా అమెరికా ఆపద సమయంలో తన బుద్ధిని నిరూపించిందంటున్నారు.. అదెలా అంటే.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పెద్ద మొత్తంలో మాస్కులను, హైడ్రాక్సీ‌క్లోరోక్విన్‌ను పోగుచేసుకుంటున్నాయనే వార్తలు గుప్పుమంటున్నాయి.. అదీగాక ఏప్రిల్ 2న, కోట్లకొద్ది మాస్క్‌లను కొనడానికి, అమెరికా భారీగా ఖర్చుచేసిందని రిపోర్ట్స్ వచ్చాయట.. ఇక కరోనా దెబ్బకు అల్లల్లాడుతున్న ఫ్రాన్స్‌కు చైనా మాస్క్‌లను  పంపితే, మధ్యలో అమెరికా వాటిని దొంగిలించిందట. ఏప్రిల్ 3న కూడా అలాంటి రిపోర్టే వచ్చింది. జర్మనీ కోసం చైనా పంపిన రెండు లక్షల ఎన్ 95మాస్క్‌లను తమ దేశానికి మళ్లించిందట.

 

 

థాయిలాండ్‌లో జర్మనీ విమానంలో లోడ్ చేయాల్సిన మాస్క్‌లను తమ విమానంలో తరలించుకుంది. అమెరికాకు ఇదేం పాడుబుద్ధి. తాము బాగుంటే చాలు, పక్కవాళ్లు ఏమైపోయినా పర్వాలేదా అని అంటున్నారట ఈ విషయం తెలిసిన వారు.. దీన్నిబట్టి చూస్తే ట్రంప్ బుద్ధే అంత. స్వార్ధం ఎక్కువ. మహమ్మారి సమయంలోనూ అమెరికా నేను బాగుంటే చాలు అన్న ధోరణిని ప్రదర్శిస్తోందట. అయినా ఆ దేశప్రజల ప్రాణాలు పోతుంటే ట్రంప్ మాత్రం ఏం చేస్తారు.. ఇలా అడ్దదార్లు తొక్కకుండా..? ఇకపోతే కరోనా నేర్పిన పాఠం ఒక్కటే. ఈ గ్లోబల్ ఎకానమిలో సరిహద్దులు, హద్ధులూ అన్నవాటికి విలువలేదు. కరోనా ఎక్కడికైనా వెళ్లగలదు. ఒక దేశం, లేదంటే ఇంకో రాష్ట్రం విఫలమైతే.... మనమూ కూడా అంతే.. ఈ వైరస్ నోటికి ఆహారం అవ్వక తప్పదు..  

మరింత సమాచారం తెలుసుకోండి: