ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య‌ను క‌ట్ట‌డి చేసేందుకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి భారీ ప్ర‌ణాళిక‌తో ముందుకు వెళ్తున్నారు. ఎక్క‌డ వైద్య స‌దుపాయాల‌కు లోటు పాటు లేకుండా చేసేందుకు ఏర్పాట్ల‌కు యంత్రాంగాన్ని ఆదేశించారు. అందులో భాగంగానే కోవిడ్‌ 19 నియంత్రణకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలవారీగా వివిధ పద్దులు కింద అందుబాటులో ఉంచింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ ఎస్‌ రావత్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విపత్తుల సహాయ నిధి టీఆర్‌ 27, గ్రీన్‌ ఛానెల్‌ పీడీ ఖాతాలు, జిల్లా మినరల్‌ ఫండ్‌ కింద మొత్తం రూ.373.76 కోట్లు అందుబాటులో ఉంచ‌డం గ‌మ‌నార్హం. 

 

రాష్ట్రంలో 13 జిల్లాల్లో 13 ప్రత్యేక కోవిడ్ ఆసుపత్రులను సిద్దం చేసింది… రాష్ట్ర స్థాయి ఆసుపత్రులలో 444 ఐసీయూ బెడ్లు 1680 నాన్ ఐసీయూ బెడ్లు ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే 284 ఐసీయూ బెడ్లు 1370 నాన్ ఐసీయూ బెడ్లను సిద్ధం చేసింది. పెద్ద మొత్తంలో టెస్టింగ్‌ పరికరాలు, సిబ్బందిని భారీ సంఖ్య‌లో కోవిడ్‌-19ను ఎదుర్కొనేందుకు ప్ర‌త్యేకంగా నియ‌మించ‌డం గ‌మ‌నార్హం.ఏపీలో  కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య  ఇప్ప‌టి వ‌ర‌కు 314కు చేరింది. తాజాగా గుంటూరు జిల్లాలో 8 కడప, నెల్లూరు జిల్లాలో ఒక్కో కేసు నమోదయ్యాయి.

 

కోవిడ్‌-19 కోసం ప్ర‌త్యేకంగా విడుద‌ల చేసిన నిధుల‌ను  క్వారంటైన్‌లో ఉన్నవారికి తాత్కాలిక వసతి, ఆహారం, దుస్తులు, ఆరోగ్య సంరక్షణకు,స్క్రీనింగ్, కాంటాక్ట్‌లో ఉన్నవారిని గుర్తించడానికి, కోవిడ్‌ 19 నియంత్రణ, చికిత్సలకు అవసరమైన పరికరాల కొనుగోలుకు, కోవిడ్‌ నియంత్రణలో భాగంగా సేవలందిస్తున్న వైద్య, ఆరోగ్య, పురపాలక, అగ్నిమాపక, పోలీసు సిబ్బందికి అవసరమైన పరికరాల కొనుగోలుకు వినియోగించ‌నున్నారు. ఇదిలా ఉండ‌గా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న కూలీల‌ను రాష్ట్రానికి సాయం అందించేందుకు సీఎం ఆదేశించిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు స్ప‌ష్టం చేశాయి. ఇప్ప‌టికే ఆయా కూలీల వివ‌రాల‌ను జాబితా రూపంలో ఆయా రాష్ట్రాల‌కు పంపిన‌ట్లు అధికారులు స్ప‌ష్టం చేస్తున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: