అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌స్తుతం ఆ దేశాన్ని క‌రోనా వైర‌స్ క‌కావిక‌లం చేస్తుండ‌డంతో విల‌విల్లాడిపోతున్నారు. క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ట్రంప్‌తో పాటు అమెరికా ప్ర‌భుత్వం ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా క‌రోనా మాత్రం ఆ దేశంలో రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. ఇప్ప‌టికే ప్ర‌పంచ క‌రోనా బాధితులు 15 ల‌క్ష‌లు క్రాస్ అయ్యాయి. ఇక క‌రోనా మ‌ర‌ణాలు ఇప్ప‌టికే 88 వేలు దాటేశాయి. క‌రోనా రిక‌వ‌రీ కేసులు 3.30 ల‌క్ష‌లు ఉన్నాయి. ఇక అగ్ర రాజ్యం అమెరికాలో 4.35 ల‌క్ష‌ల పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. ఇప్ప‌టి వ‌ర‌కు 15 వేల మంది చ‌నిపోయారు.

 

రోజు రోజుకు ఈ కౌంట్ విప‌రీతంగా పెరిగిపోతూ వ‌స్తోంది. ఇక ముందుగా యాంటీ మ‌లేరియా మందు ఇవ్వాల‌ని ట్రంప్ భార‌త్‌ను రిక్వెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే మ‌న‌దేశంలో ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల నేప‌థ్యంలో ప్ర‌ధాన‌మంత్రి మోదీ ఈ మందును అమెరికాకు ఇచ్చేందుకు నిరాక‌రించారు. ముందుగా ఈ మందు కోసం మ‌న దేశానికి విజ్ఞ‌ప్తి పెట్టుకున్న ట్రంప్ మ‌నం నిరాక‌రించ‌డంతో చివ‌ర‌కు భ‌విష్య‌త్తులో త‌గిన ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని వార్నింగ్ ఇచ్చారు. ఇక మోదీ ఈ మందు ఇచ్చేందుకు అంగీక‌రించ‌డంతో ఇప్పుడు మ‌న దేశంతో పాటు మోదీపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. అమెరికా జాతీకి ఇండియా చేసిన మేలు ఎప్ప‌ట‌కీ మ‌ర్చిపోలేన‌ని చెపుతున్నారు. 

 

మోదీ లాంటి బ‌ల‌మైన నాయ‌క‌త్వం దేశానికి నిజంగా అవ‌స‌రం అని.. ఈ పోరాటంలో మాన‌వ‌త్వం చాటుకున్న మోదీకి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు అని చెప్పారు. ట్రంప్ ఒక్క‌సారిగా ఇంత‌లా మాట మార్చేయ‌డం వెన‌క త్వ‌ర‌లో జ‌రిగే అమెరికా ఎన్నిక‌లు కూడా ఓ కార‌ణ‌మంటున్నారు విశ్లేష‌కులు. అమెరికాలో భార‌తీయుల ఓటింగ్ భారీగా ఉంది. ఈ క్ర‌మంలోనే వీరి ఆగ్ర‌హానికి గురికాకుండా ఉండాల‌న్నా.. భ‌విష్య‌త్తులో మ‌ళ్లీ గెలిచి రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ అవ్వాల‌న్నా మోదీ, అండ్ భార‌తీయుల మ‌ద్దుతు ఉండాల్సిందే అని ట్రంప్ గ్ర‌హించిన‌ట్లుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: