ప్రపంచాన్ని గడ గడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు అన్ని దేశాలకు వ్యాపించిన విషయం తెలిసిందే. ఇప్పుడు భారత దేశంలో దీని జోరు కొనసాగుతుంది.  గత నెల 24 నుంచి దేశంలో లాక్ డౌన్ కొనసాగుతుంది..దాంతో ఎక్కడి వ్యవస్థలు అక్కడే స్థంభించిపోయాయి.  రాకపోకలు అన్నీ బంద్.. తప్పని సరిపరిస్థితి అయితే తప్ప... ఎవరూ ప్రయాణాలు పెట్టుకోవడం లేదు.  అయితే ఆ మద్య ఏపి సరిహద్దు వద్ద స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.  ముఖ్యంగా తెలంగాణ -ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద ఊళ్లకు వెళ్లేవారిని క్వారంటైన్ విధించిన విషయం తెలిసిందే. 

 

 

గత కొన్ని రోజులుగా ఏపి , తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. మరణాలు కూడా సంబవిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో లాక్ డౌన్ విషయంలో పోలీసులు సీరియస్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఏపి, తెలంగాణ సరిహద్దుల వద్ద మరోసారి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. హైదరాబాద్ లో క్వారంటైన్ పూర్తి చేసుకున్న 35 మందిని ప్రత్యేక బస్సులో తెలంంగాణ ప్రభుత్వం ఏపికి తరలించింది. 

 

 అయితే కృష్ణా జిల్లా గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ఆ బస్సును అడ్డుకున్నారు.  అయితే తమకు పూర్తిగా నయమైందని.. క్వారంటైన్ పూర్తి అయిన తర్వాత ప్రయాణం చేస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన లేఖను చూపించినా పోలీసులు అనుమతించడం లేదని.. డీఎస్పీ వచ్చి చెక్ చేస్తే కానీ పంపించమని తేల్చి చెప్పారు.. ఈ విషయంపై చర్చలు కొనసాగుతున్నాయి. 

 

 


కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: