లోకంలో ఇన్నాళ్లుగా స్వేచ్చగా తిరిగిన మనుషులు ఇప్పుడు పంజరాల్లో బంధీలుగా మారారు.. ఇంతకాలం మనుషులకు భయపడిన వన్యమృగాలు ప్రస్తుతం హాయిగా విహరిస్తున్నాయి.. అవి వాటిజీవితంలో కూడా ఇంత హాయిగా ఉంటాయని అనుకుని ఉండకపోవచ్చూ.. బహుశ విధి విచిత్రం అంటే ఇదే కావచ్చూ.. మనిషి తన స్వార్ధం కోసం ప్రకృతిలోని ప్రతి ప్రాణికి ఉన్న జీవించే హక్కును హరించాడు.. కొన్ని కొన్ని ప్రాణులు అంతరించడానికి మూలం అయ్యాడు.. ఇకపోతే ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు నిశబ్దంగా మారింది.. అదీగాక లాక్‌డౌన్‌ తో నిత్యం భక్తుల రద్దితో, గోవింద నామాలతో మారుమోగే తిరుమల గిరుల్లో గత రెండు వారాలుగా నిశ్శబ్ద వాతావరణం నెలకొనడంతో వన్యమృగాలు జన సంచారంలోకి వచ్చేస్తున్నాయి.

 

 

ఎప్పుడు రణగొణధ్వనులతో నిండిన ఈ ఘాట్ రోడ్లల్లో ఇప్పుడు అలికిడి లేకపోవడంతో శేషాచల అడవుల్లోని జంతువులు తిరుమల వీధుల్లోకి వచ్చి స్థానికులను, ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. స్థానికులు నివాసం ఉంటున్న బాలాజీ నగర్, ఈస్ట్‌ బాలాజీ నగర్లలో చిరుతలు, అడవి పందులు, దుప్పి, పాముల సంచారం అధికంగా ఉంటోందట.. కాగా పాపవినాశనం మార్గంలో గజరాజుల గుంపు సంచరిస్తోంది.. ఇక అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న కల్యాణ వేదిక, శ్రీవారి సేవ సదన్‌ వద్ద చిరుత, ఎలుగు బంట్లు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించగా, మ్యూజియం వెనుక భాగంలో ఉన్న అటవీ ప్రాంతంలో రేసు కుక్కలు దుప్పిలపై దాడికి దిగిన ఘటనలతో  స్థానికులు భయాందోళనకు గురవుతున్నారట..

 

 

ముఖ్యంగా రెండు ఘాట్‌ రోడ్లలో చిరుతల సంచారం పెరిగిందంటున్నారు.. ఇక వన్య మృగాలు జనావాసంలోకి వస్తుండడంతో సాయంత్రం తరువాత బయట తిరగరాదని టీటీడీ, పోలీసు అధికారులు స్థానికులకు గట్టి ఆంక్షలు విధించారు. ఇదిలా ఉండగా తిరుమలకు భక్తుల రాక 1900 వ సం.. తర్వాత నుంచి క్రమంగా పెరుగుతూ ఉండటంతో అప్పటివరకు ఇక్కడ నివసించిన వన్యమృగాల సంచారం క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. కానీ ప్రస్తుతం ఈ గిరులు మొత్తం ప్రశాంతంగా మారడంతో తిరుమల ఘాట్‌ రోడ్లపైకి వన్యమృగాలు వచ్చేశాయి..

 

 

ఇకపోతే  128 ఏళ్ల క్రితం మాత్రం ఒకసారి రెండు రోజుల పాటు గుడి మూతపడిన సమయంలో ఇలాంటి పరిస్థితి కనిపించింది. అప్పట్లో ఆలయం చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం కావడం, తిరుమలలో శ్రీవారి ఆలయం మాత్రమే ఉండడంతో అర్చకులు తిరుపతి నుంచి ఉదయం గుర్రాలపై తిరుమలకు చేరుకుని స్వామివారి కైంకర్యాలు పూర్తిచేసుకుని సంధ్యా సమయం మొదలు కాకముందే తిరుపతికి తిరుగు ప్రయాణం అయ్యేవారు. ఇప్పుడు మళ్లీ అలాంటి వాతావరణం కనిపిస్తోంది. మొత్తానికి కరోనా వన్యప్రాణులన్నీటికి స్వేచ్చను ప్రసాదించింది.. మనుషులను బంధీలుగా చేసింది..

 

మరింత సమాచారం తెలుసుకోండి: