క‌రోనా దెబ్బ‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. ఇప్ప‌టికే ఖ‌జానా నిధుల్లేక నిండుకుంది. దీంతో క‌నీసం అత్య‌వ‌స‌రాల‌కు, నిత్యావ‌స‌రాల‌కు కూడా నిధుల కొర‌త వెంటాడుతోంది. దీంతో జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి రిజ‌ర్వు బ్యాంకు నుంచి  రూ.1000కోట్ల అప్పు తీసుకుంది. గత ఏడాదిలో ప్ర‌భుత్వం వివిధ మార్గాల్లో దాదాపు రూ.77వేల కోట్ల అప్పుల‌ను స‌మీక‌రించుకుంది. అయితే అభివృద్ది జ‌రిగితే ఎంతోకొంత మేలు జ‌రుగుతుంద‌నుకున్న ప్ర‌భుత్వానికి క‌రోనా రూపంలో ఆర్థిక సంవ‌త్స‌రం తొలిద‌శ‌లోనే పెద్ద ఎదురుదెబ్బ త‌గిలింది. 

 

ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో కేంద్రం ఆదుకోకుంటే రాష్ట్రం చాలా వెన‌క‌బ‌డిపోతుంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. అందుకే ప్ర‌ధాన‌మంత్రి మోదీ వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మాట్లాడినప్పుడు కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేకంగా నిధులు మంజూరీ చేయాల‌ని సీఎం జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి చెప్పారు. అంతేకాక ఇటీవ‌ల ఓ లేఖ కూడా రాయ‌డం గ‌మ‌నార్హం. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రాలేదు. దీంతో వైద్య‌, ఇత‌ర ఖ‌ర్చుల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం రిజ‌ర్వు బ్యాంకు నుంచి రూ.వెయ్యి కోట్ల‌ను అప్పుగా తీసుకుంది. ఇందుకు సంబంధించి మంగ‌వారం ఉత్త‌ర్వులు కూడా వెలువ‌డ్డాయి.  

 

వాస్త‌వానికి క‌రోనాకు ముందు పెద్ద‌గా ఇబ్బందుల్లేని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇప్పుడు ఒక్క‌సారిగా ఆర్థిక స‌మ‌స్య‌ల్లో కూరుకుపోయింది.  లాక్‌డౌన్ నేప‌థ్యంలో అన్ని వ్య‌వ‌స్థ‌లు స్తంభించిపోవ‌డంతో రాబడి లేకుండా పోయింది. రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్.. తదితర రంగాల నుంచి పైసా పుట్టడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. అదే సమయంలో వేతనాలు, పింఛన్లు, ఆసరా సహా పలు కీలక పథకాలకు దాదాపు రూ.10 వేల కోట్లు అవసరం అవుతాయి. దీంతో.. కేంద్ర పన్నుల వాటా, రుణాలు సహా ఇతర మార్గాల ద్వారా నిధులను సమీకరించుకోవడంపై ఆర్థిక శాఖ దృష్టి సారించింది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: